ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులతో ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్నారు.. ఇప్పటికే అధికార పార్టీ అయిన వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుంది.. అయితే రాజకీయంగా బలంగా వున్న వైసీపీ పార్టీని ఎదుర్కోవడానికి ప్రధాన ప్రతిపక్షాలు అయిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఎర్పిడిన విషయం తెలిసిందే.. టీడీపీ, బీజేపీ, జనసేన దాదాపుగా పొత్తులో భాగంగా వారి అభ్యర్థులను అందరినీ ప్రకటించాయి. అయితే జనసేన తరపున ప్రకటించాల్సిన మూడు అసెంబ్లీ స్థానాలు మరియు ఒక పార్లమెంట్ స్థానమే పెండింగ్ లో ఉంది. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించారు.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 18 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించారు.కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్‌ను పవన్ ప్రకటించారు. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లను జనసేన పెండింగ్‌లో పెట్టింది.

ఇదే సమయంలో జనసేన పోటీ చేసే బందరు పార్లమెంటు స్థానాన్ని కూడా పెండింగులో ఉంచింది.పెండింగ్‌లో ఉన్న సీట్లల్లో అభ్యర్థుల ఖరారుపై జనసేన పార్టీ ఇప్పటి వరకు ఏటూ తేల్చుకోలేకపోతోంది. జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటు విషయం రసవత్తరంగా మారింది..ఈ టికెట్‌ నాదంటే నాదని ఇద్దరు నాయకుల మధ్య గొడవ జరుగుతోంది. సీటును తనకే ఖరారు చేశారంటూ వంశీకృష్ణ స్వయంగా ప్రకటించుకుని ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలెట్టేసారు.. అవనిగడ్డ సీటు కోసం విక్కుర్తి శ్రీనివాస్‌, బండి రామకృష్ణ మరియు బండ్రెడ్డి రామకృష్ణ పోటీ పడుతున్నారు. అయితే వీరిలో ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో విక్కుర్తికే మొగ్గు ఉన్నట్లుగా తేలింది. కానీ టీడీపీ నుంచి మండలి బుద్ద ప్రసాద్ ను చేర్చుకుని ఆయనకు టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. 

పాలకొండ సీటు కోసం ఆరుగురు పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి విశ్వాసరాయి కళావతి పోటీ చేస్తున్నారు. దీనితో జనసేన తరఫున కూడా మహిళనే బరిలోకి దించే ఆలోచనలో జనసేన నాయకత్వం ఉన్నట్లు తెలుస్తుంది.. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి విషయంలో పవన్ వల్లభనేని బాలశౌరిని పక్కన పెట్టి వేరే అభ్యర్థి  కోసం వెతుకుతున్నట్లు సమాచారం. పిఠాపురం అసెంబ్లీ అభ్యర్దిగా బరిలో నిల్చున్న పవన్ కల్యాణ్ నేటి నుంచి ఆ నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టనున్నారు. ఈ పర్యటన తర్వాత పెండింగ్ లో వున్న అభ్యర్దుల పేర్లను పవన్ ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..అయితే పవన్ కల్యాణ్ సీట్ల సర్దుబాటుపై అధికార పార్టీ నేతలు సెటైర్ లు వేస్తున్నారు. కళ్యాణం సారూ ఉన్న రెండు డజన్ సీట్లల్లో కూడా తటపటాయించుడేనా అని సెటైర్ లు వేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: