ఆంధ్రప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థులను ఖరారు చేసారు. వారందరు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ టికెట్ల కేటాయింపు విషయంలో కొన్ని చోట్ల టీడీపీ మరియు వైసీపీ రెండు పార్టీలలో సొంత పార్టీ నేతలే కొంచం అసహనం వ్యక్తం చేస్తున్నారు.టీడీపీ అయితే కొన్ని సీట్ల మార్పునకు తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇచ్చిన కొంతమంది అభ్యర్థుల టికెట్స్ వెనక్కి తీసుకుంటాను అంటూ ఒక ప్రచారం జరుగుతుంది.దాంట్లో భాగంగానే పోలవరంలో అభ్యర్థిని మారుస్తారంటు ఒక ప్రచారం జరుగుతుంది.అయితే తిరుపతి టికెట్ విషయంలో కూడా అక్కడ ఉన్న జనసేన టికెట్ టీడీపీ తీస్కొని వారికీ వేరే చోటు పోటీకి టికెట్ ఇస్తారంటూ ఒక ప్రచారం జరుగుతుంది.అయితే ఇది కేవలం ప్రచారం అనే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే ఎనిమిది నియోజకవర్గాలు ఐనా తిరుపతి, ఉదయగిరి, పోలవరం,గుంటూరు-2 మొదలగు కొన్ని చోట్ల ప్రచారం అనేది యాక్టీవ్ గా జరగకపోవడం అనేది టీడీపీ అధిష్టానం వాదన.అందుకనే అక్కడి వారిని వేరే చోటుకి మార్చాలని భావిస్తుంది.ఎందుకంటె వారిని అలానే వదిలేస్తే ఏకు మేకై మొత్తానికే ఇబ్బంది వస్తుంది అని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తుంది.

మరొక వైపు వైసీపీలో కూడా సీట్ల విషయంలో కొన్ని చోట్ల అభ్యర్థులు అసహనానికి గురి అవుతున్నారు అనేది తెలుస్తుంది. గుంటూరు విషయానికి వస్తే కిలారి రోశయ్య అక్కడ నుండి పోటీకి సిద్ధంగా లేరని తెలుస్తుంది. ఈ మధ్యనే వైసీపీ పార్టీ పెద్దలతో ఈ విషయంపై చర్చించిన రోశయ్య తనను నియోజకవర్గం మార్చవలసిందిగా కోరారు. అయితే దానిపై పార్టీ అధిష్టానం ఉగాది పండుగ తర్వాత డెసిషన్ తీసుకునే ఆలోచనలో ఉందని తెలుస్తుంది.ఈవిధంగ గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను మార్చే పనిలో పడి అయోమయానికి గురి అవుతున్నారు. కాకపోతే ఇలాంటి పరిస్థితి ఎక్కువగా టీడీపీలో ఉందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: