ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో సైతం 110 కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధించి మరోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామనే నమ్మకాన్ని కలిగి ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నా ఈ పార్టీలకు మాత్రం రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందనే కాన్ఫిడెన్స్ లేదు. జగన్ వయస్సు బాబు అనుభవం అంత మాత్రమేనని అయినప్పటికీ కూటమిని గజగజా వణికిస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 
2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు మేలు చేసేలా పథకాలను అమలు చేసి ఉంటే కూటమికి ఇంత దారుణమైన పరిస్థితి అయితే వచ్చేది కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కుప్పంలో చంద్రబాబును సైతం ఓడించడమే లక్ష్యంగా వైసీపీ రాజకీయాలు చేస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. చంద్రబాబును ఓడించడంలో వైసీపీ ప్లాన్స్ వర్కౌట్ అయితే మాత్రం టీడీపీకి మరిన్ని ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.
 
మూడు నెలల క్రితం వరకు రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి సైతం ఏమంత అద్భుతంగా లేదు. ప్రధానంగా జగన్ ప్రజల్లోకి రావడం లేదనే విమర్శలు వినిపించాయి. అయితే జగన్ మాత్రం మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి రావడంతో ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించారనే చెప్పాలి. జగన్ కూటమిని దెబ్బ కొట్టే ఏ అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది.
 
కొంతమంది కీలక నేతలు పార్టీని వీడినా ఆ నేతల వల్ల పార్టీకి మరీ భారీ స్థాయిలో నష్టం కలగకుండా జగన్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోసారి వైసీపీనే అధికారంలోకి వస్తుందని పార్టీని నమ్ముకున్న నేతలకు కీలక పదవులు ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. ఎన్నికల్లో గెలుపు విషయంలో వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఆశించిన మేర ఫలితాలను అందిస్తాయో లేదో చూడాల్సి ఉంది. చంద్రబాబు వ్యూహాలకు అనుగుణంగా ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్లేలా జగన్ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: