ప్రతి ఏటా ఉగాదినాడు మన తెలుగు వారికి జాతకాలు చూసుకోవడం అనేది అనాదినుండి ఒక సంప్రదాయంగా వస్తున్నది. ఈ క్రమంలోనే ఈ తెలుగు సంవత్సరాది నాడు ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకుల జీవితం ఎలా ఉండబోతుంది అనే చర్చ సోషల్ మీడియాలో చాలా వాడివేడిగా జరుగుతోంది. అందులో మొదటివారు పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాలలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో జనసేన పార్టీని స్థాపించారు నటుడు పవన్ కల్యాణ్. 2014 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌లో పోటీ చేయకుండా కేవలం రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీకి మద్దతు ప్రకటించి ఇరు పార్టీలు అధికారంలోకి రావడంలో అపుడు చాలా కీ రోల్ పోషించారనే విషయం అందరికీ తెలిసినదే. ఆ తరువాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒక్కస్థానానికే పరిమితమయ్యారు పవన్ కళ్యాణ్. కాగా ఈసారి మరలా రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీకి మద్దతు ప్రకటించి, పొత్తు పెట్టుకొని బరిలో దిగుతున్నారు.

కాగా ఈసారి ఆయన భంగపడకుండా, అభిమానులను బెంగపెట్టకుండా గెలుస్తారా? లేదా? అని జనసైనికులు ఆయన జాతకం చూడడం మొదలు పెట్టారు. అయితే ఆయన జాతకం చూసిన కొంతమంది పవన్ గాలి ఈసారి గట్టిగా వేయబోతుందని జోశ్యం చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ కలిగిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పెద్దగా ప్రభావితం చూడలేకపోవడం జనసైనికులు తట్టుకోలేకపోతున్నారు. అయితే ఈసారి వారి ఆకలి తీరనుందనే పుకారు షికారు చేస్తోంది సోషల్ మీడియాలో.

ఇక అదే వరుసలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నిలుస్తారు. ఈయన జాతకం కూడా కాంగ్రెస్ నాయకులు చూసినట్టు భోగట్టా. అయితే ఈసారి రాహుల్‌ గాంధీకి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయని ఓ అంచనాకి వస్తున్నారు ఆయన అభిమానులు. ఇక చివరగా ఈ లిస్టులోకి నారా చంద్రబాబు, లోకేష్ చేరారు. ఏపీలో త్వరలో రాబోయే ఎన్నికల్లో తండ్రీ కొడుకులు తమ ఉనికిని తప్పకుండా చాటుకుంటారు అని ప్రముఖ జ్యోతిష్యుడు అంగదానంద శాస్త్రి ఓ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. మరి కొన్ని రోజుల్లో ఆయా రాజకీయ నేతల భవితవ్యం తేలబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: