పవన్ కళ్యాణ్.. ఈయన పేరు చెబితే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఈయన సినిమాల ఎంతో పేరు తెచ్చుకున్నారు.  ఇలాంటి పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేయాలని జనసేన అనే పేరుతో పార్టీని స్థాపించారు. ఎలాగైనా ఈసారి జనసేన పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా  ఆ పార్టీ నుంచి పోటీ చేసిన  ప్రతి అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలని  కంకణం కట్టుకున్నారు. దాని ప్రకారం ఆయన కార్యాచరణ రూపొందించుకొని ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు అనేక విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఉగాది సందర్భంగా తను పోటీ చేసే పిఠాపురంలో జనసేన కార్యాలయంతో పాటు స్వగృహాన్ని ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రజలకు క్రోది నామ సంవత్సర  శుభాకాంక్షలు తెలియజేశారు. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గురించి ఒక వార్త కొన్ని నెలలుగా  వినిపిస్తోంది. తన మూడో భార్య అన్నా లేజ్నోవాతో  ఆయన విడిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.  అంతేకాకుండా సీఎం జగన్ కూడా పవన్ కళ్యాణ్ నిత్య పెళ్లికొడుకంటూ, వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించాడని, మహిళలను గౌరవించని  ఈయన ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఆయనపై ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు.
 
ఈ క్రమంలోనే జనసేన మాజీ నాయకుడు పోతిన మహేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గృహప్రవేశం చేసినప్పుడు దంపతులు ఇద్దరు కలిసి చేయాలని సవాల్ విసిరారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కడే వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఆయన అన్న లేజ్నోవాతో విడిపోయారని అందుకే ఆమె ఈ కార్యక్రమానికి రాలేదని మహేష్ అంటున్నారు. ఆయన ఈ విధమైన కామెంట్లు చేయడంతో పవన్ కళ్యాణ్ తన భార్యతో నిజంగానే విడిపోయారా అనే ఆలోచనలో పడ్డారు ఏపీ ప్రజలు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ను తన మూడో భార్య రూపంలో దెబ్బతీసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై పవన్ రియాక్ట్ అయి తన భార్యను తీసుకువచ్చి కాస్త ప్రచారం చేస్తే వారి మాటలకు తెరపడడమే కాకుండా, ఆయనకు మరింత కలిసి వస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: