ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా  మైకుల మోత, నేతల కూత వినిపిస్తోంది. ఒక్కో నేత ఒక్కో విధమైనటువంటి విన్యాసాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నువ్వా నేనా అన్నట్టు హోరా హోరీగా తలపడుతున్నారు. ఇంకా ఎన్నికల సమయానికి 34 రోజుల గడువు మాత్రమే ఉంది.  ఎలక్షన్స్ రోజు వదిలిపెడితే 33 రోజులు మాత్రమే ప్రచారానికి టైముంది. ఇదే తరుణంలో  ఓవైపు వైసీపీ మరోవైపు టిడిపి కూటమి ఒకరిపై ఒకరు  విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా  జగన్ ప్రభుత్వంపై ఒక విమర్శ గట్టిగా వినిపిస్తుంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
అలాంటి తరుణంలో జగన్ చుట్టూ కరెంటు ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రోజుకి నాలుగు నుంచి ఐదు సార్లు కరెంటు కట్ అవుతోందని ప్రజలంటున్నారు. మరి ఇది ప్లాన్ ప్రకారం చేస్తున్నారా.. లేదంటే కరెంట్ సరిపోక ఇలా జరుగుతోందా అనేది  అసలు అంతు పట్టడం లేదట. సాధారణంగా రాష్ట్ర ప్రజలకు ఎంత కరెంటు అవసరమో అధికారులకు తెలుసు.
 రాష్ట్రానికి అవసరమయ్యే కరెంటు కంటే కాస్త ఎక్కువగా కరెంటు కొనుగోలు చేసి అందిస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ అధికారులు ఆ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కరెంట్ కట్ చేస్తున్నారట. కరెంటు కట్ అయినప్పుడల్లా  జగన్ ని ప్రజలు తిట్టుకుంటున్నారని, దీనివల్ల రాబోవు ఎన్నికల్లో జగన్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   ఈ కరెంటు విషయాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకున్నటువంటి టిడిపి కూటమి  ప్రజల్లోకి వెళ్తోంది. అంతేకాకుండా  జగన్ మరోసారి గెలిస్తే కరెంటు కష్టాలు ఎక్కువ అవుతాయని  అంటున్నది. మిగులు కరెంటు ఉండే రాష్ట్రంలో  కరెంటు కష్టాలకు కారణం ఏంటో కాస్త జగన్ తెలుసుకోవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి ఈ విషయంపై జగన్ దృష్టి పెడతారా, లేదంటే అలాగే వదిలేస్తారా అనేది  ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: