రాబోయే అసెంబ్లీ పార్లమెంట్, ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తూ ఉంటే... ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం , మరియు జనసేన , బిజేపీ పార్టీలు పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నాయి. ఈ పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటును బీజేపీ కి ఇచ్చారు. అందులో భాగంగా బీజేపీ పార్టీ ఈ నియోజకవర్గ సిట్ ను సుజనా చౌదరికి ఇచ్చారు. ఫస్ట్ టైమ్ ఈ ఏరియా నుండి ఒక కమ్మ సామాజిక అభ్యర్థి పోటీ చేస్తుండడం జరుగుతుంది.

ఈ ఏరియాలో ఎక్కువ శాతం బీసీలు, ముస్లింల జనాభా ఉంది. దానితో ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకే టికెట్స్ లను ఇవ్వడానికి పార్టీలు మొదటి ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చాయి. ఈసారి బీజేపీ నాయకత్వం బీసీ, ముస్లిం అభ్యర్థులను కాకుండా కమ్మ సామాజిక వర్గ అభ్యర్థికి టికెట్ ను ఇచ్చింది. ఇక అధికార పార్టీ వైసీపీ నుండి ఆసిఫ్ పోటీ చేస్తున్నాడు.

ఈయన గతంలో కార్పొరేటర్ గా పని చేశాడు. కార్పొరేటర్ గా ఉన్న వ్యక్తి నేరుగా ఎమ్మెల్యేకు పోటీ చేస్తూ ఉండడంతో ఆయన గెలుపుకు ఏ మాత్రం ఢోకాలేదు సుజనా భావించారు. ఇక ఈ ఏరియాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారు. ఇక మొదటి నుండి ఈ ఏరియా  సిట్ ను బీసీ జనసేన అభ్యర్థి అయినటువంటి పోతిని మహేష్ కి దక్కుతుంది అని చాలామంది అనుకున్నారు.

ఈయనకు ఈ ఏరియాలో మంచి పట్టు ఉంది. ఈయనకు జనసేన పార్టీలో మంచి పట్టు ఉంది. గతంలో జనసేన నుండి జరిగిన కొన్ని ఎన్నికలలో కూడా ఈయన తరఫునుండి అనేక మంది పోటీ చేశారు. అందులో గెలుపులు రాకపోయినా చాలా తక్కువ మెజారిటీతో ఈయన వర్గం ప్రజలు ఓడిపోయారు. ఇంత క్రేజ్ ఉన్న ఈయనకు సీటు దక్కకపోవడంతో ఇతను రెబెల్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఒక వేళ ఈయన నిజంగానే రెబల్ అభ్యర్థిగా కనుక పోటీ చేసినట్లు అయితే సుజనా కి రావలసిన ఓట్లు చిలే అవకాశం ఉంది. అదే కనుక జరిగినట్లు అయితే ఆ అంశం ఆసిఫ్ కు బాగా కలిసి వస్తుంది. ఇక ప్రస్తుత పరిణామాలు బట్టి చూస్తే పోతిని రెబల్ నా పోటీ చేయకుండా చూసుకునే అవసరం సుజనాపై ఉంది. ఒక వేళ పోతిని కనక పోటీ చేసినట్లు అయితే సుజనా గెలుపు అవకాశాలు చాలా వరకు తగ్గే అవకాశం కూడా చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: