ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీ లాగే ప్రతిపక్ష పార్టీ వారి వారి ప్రచారాలతో దూసుకుపోతున్నారు. వైసీపీ అధిష్టానం మొదట్లో తన అభ్యర్థులను ప్రకటించే సమయంలో కొన్ని కొన్ని కారణాల వల్ల ముందుగా అనౌన్స్ చేసినా అభ్యర్థులను మారుస్తా వచ్చారు.ఒకసారి మార్చిన అభ్యర్థులు మరలా మార్చడం కూడా జరిగింది.దాదాపు జగన్ తన అభ్యర్థులను పదకొండు లిస్ట్లుగా డివైడ్ చేసి మార్చడం జరిగింది.దాంతో జగన్ కి అభ్యర్థులను ప్రకటించడంపై కంట్రోల్ లేదంటూ, భయపడుతున్నాడంటూ ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి పుంఖాను పుంఖానుగా కధనాలు  రాసింది.

దాంతో వైసీపీ కూడా టీడీపీ లిస్ట్ పై ఫోకస్ పెట్టింది. అయితే అప్పటికి ఇంకా టీడీపీ అభ్యర్థుల లిస్ట్ ఇంకా బయటికి రాలేదు.ఎప్పుడైతే టీడీపీ లిస్ట్ బయటికి వచ్చిందో అపుడు ఆయా నియోజకవర్గాల్లో గందరగోళం స్టార్ట్ యింది కానీ టీడీపీ దాన్ని ఎక్కువగా బయటకి రాకుండా చూసుకుంది. కానీ వైసీపీ మాత్రం దానిపై ఫోకస్ పెట్టింది.ఒకవైపు టీడీపీ 144 సీట్స్, బీజేపీ 10సీట్స్, జనసేన 20 సీట్స్ అనౌన్స్మెంట్ చేసింది.ఒక్క జనసేన పాలకొండ మాత్రం మొదట్లో ఆపేసారు.

ప్రస్తుతం టీడీపీలో మార్పులు చేర్పులు అంటే ఎవరు ఖండించక పోగా కొత్తగా కొన్ని కొన్ని నియోజకవర్గల్లో ఐవిఆర్ యస్ సర్వే అని ప్రారంభించారు.తాజాగా అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఐవిఆర్ యస్ అనేది ఉదయగిరి నియోజకవర్గంలో బోలినేని వైపు మొగ్గు చూపే పరిస్థితి ఉంది కానీ తాజాగా చేసిన ఐవిఆర్ యస్సర్వేలో మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది.అయితే మరలా బోలినేనికి సీట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం తెర మీదకు వచ్చింది.ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇంకా కొన్ని చోట్ల రాకపోవడం వల్ల అభ్యర్థులు పూర్తిగా ప్రచారంలో లీనఁ కాలేకపోతున్నారు అని సొంత పార్టీ నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: