ఏపీ ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తీసుకొనిరావడానికి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతలను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. చంద్రబాబు చాలా మారాడంటూ స్వయంగా ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. జగన్ మద్యపాన నిషేధం చేయలేదని విమర్శించే చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తానని చెబుతున్నారు.
 
ఒకప్పుడు వాలంటీర్ల వ్యవస్థ అరాచకమని వాలంటీర్ల ద్వారా వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించిన చంద్రబాబు ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి స్కీమ్ కు బదులుగా తల్లికి వందనం స్కీమ్ ను అమలు చేస్తామని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఈ హామీని అమలు చేస్తామని బాబు చెబుతున్నారు.
 
ప్రస్తుతం జగన్ సర్కార్ 3,000 రూపాయలు పింఛన్ ఇస్తుండగా కూటమి అధికారంలోకి వస్తే పింఛన్ 4,000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు జీతం రెట్టింపు చేస్తానని చెబుతున్నా వాలంటీర్లు ఆ హామీని నమ్మట్లేదు. చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించవచ్చు కానీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే వాళ్లను వాలంటీర్లుగా నియమించుకోవచ్చని కొంతమంది వాలంటీర్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
 
హామీలను అమలు చేయడం సులువు కాదని చంద్రబాబును నమ్మితే తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చాలామంది వాలంటీర్లు ఫీలవుతున్నారు. చంద్రబాబు వాలంటీర్ల ఓటు బ్యాంక్ ను పొందాలని భావిస్తే అత్యాశే అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్లకు ప్రయోజనం చేకూరేలా జగన్ నుంచి ఎలాంటి హామీ వస్తుందో చూడాల్సి ఉంది. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది జగన్ అనే సంగతి తెలిసిందే. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పథకాలు నేరుగా అందేలా జగన్ అడుగులు పడ్డాయి. జగన్ సైతం వాలంటీర్ల వేతనాల పెంపు దిశగా నిర్ణయం తీసుకుంటే టీడీపీ ఇచ్చిన హామీ వల్ల ఆ పార్టీకి ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పవచ్చు.
 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: