ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా వివేకా హత్య కేసు గురించి పదేపదే ప్రస్తావిస్తూ పొలిటికల్ గా సక్సెస్ కావాలని ఫీలవుతున్నారు. అన్నతో విబేధాలు ఎందుకో చెప్పని షర్మిల జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడానికి మాత్రం వెనుకాడటం లేదు. విచిత్రం ఏంటంటే జగన్ పై చంద్రబాబు, పవన్ కంటే షర్మిల ఒకింత ఘాటుగా విమర్శలు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు.
 
షర్మిల గురించి జగన్ పరోక్షంగా విమర్శలు చేస్తున్నా డైరెక్ట్ గా మాత్రం విమర్శలు చేయడం లేదు. షర్మిల పొలిటికల్ గా సక్సెస్ కావడం అసాధ్యమని 2024 ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ పార్టీకి 2 శాతానికి మించి ఓట్లు కష్టమని జగన్ భావిస్తున్నారు. చంద్రబాబు పొలిటికల్ స్టార్ క్యాంపెయినర్ షర్మిల అని పరోక్షంగా కామెంట్లు చేసిన జగన్ అంతకు మించి విమర్శలు చేస్తే తనను టీడీపీ నేతలు షర్మిల విషయంలో తనను  టార్గెట్ చేసే అవకాశం ఉందని ఫీలవుతున్నారు. షర్మిల విషయంలో పదేపదే విమర్శలు చేసి ఆమె స్థాయిని పెంచాలని జగన్ భావించడం లేదు. షర్మిల తనకు పోటీ అని కూడా జగన్ ఫీలవ్వడం లేదని అందుకే ఆమె విషయంలో సైలెంట్ గా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.
 
ఆస్తుల విషయంలో ఉన్న విబేధాల వల్లే జగన్, షర్మిల మధ్య మనస్పర్ధలు తలెత్తాయని అంతకు మించి ఏం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ కు సీఎం పదవి దక్కకుండా చేయడమే షర్మిల టార్గెట్ అని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో జగన్ సీఎం కావడానికి తాను కూడా ఒక కారణమని షర్మిల భావిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల్లో జగన్ ను ఓడిస్తే జగన్ కు తన వాల్యూ అర్థమవుతుందని ఆమె ఫీలవుతున్నారు.
 
అయితే షర్మిల తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ సపోర్ట్ లేకపోతే షర్మిలకు ప్రజల మద్దతు అస్సలు ఉండదని ఈ విషయం షర్మిలకు అర్థం కావాలంటే మరికొన్ని రోజుల సమయం పడుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2024 ఎన్నికలతో షర్మిల పొలిటికల్ కెరీర్ కూడా ముగిసినట్టేనని కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవడం అసాధ్యమని తెలుస్తోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: