ఉమ్మడి అనంతపురం జిల్లాలో భాగమైన మడకశిర నియోజకవర్గం పునర్విభజన తర్వాత.. శ్రీ సత్య సాయి జిల్లాలో భాగమయ్యింది.. మడకశిర నియోజకవర్గంలో 2,11,152 ఓట్లు ఉన్నాయి. మడకశిర సామాజిక రాజకీయ చరిత్ర విషయానికి వస్తే.. ఎస్సీ, ఎస్టీ,బీసీ కులస్తులు కాస్త ఎక్కువగానే ఉన్నారు. ఇక గెలుపు,  ఓటములను విశ్లేషిస్తే.. ఎస్సీలు 7సార్లు , యాదవులు 3సార్లు,  గౌడ్ 2సార్లు గెలుపొందారు.. కాంగ్రెస్ పార్టీ-8 సార్లు.. టిడిపి మూడుసార్లు,  వైసిపి ఒకసారి గెలిచింది. మడకశిర నుంచి రఘువీరారెడ్డి మూడుసార్లు గెలిచారు. అయితే 2009లో మడకశిర ఎస్సీ నియోజకవర్గంగా మారిపోయింది.



కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీ తిమ్మారెడ్డి రెండుసార్లు, రఘువీరారెడ్డి మూడుసార్లు మాత్రమే గెలిచారు.. మిగిలిన వారందరూ కేవలం ఒక్కొక్కసారి మాత్రమే గెలిచారట. 2014లో వైసీపీ పార్టీ నుంచి డాక్టర్ తిప్పేస్వామిని పూర్తిగా బరిలోకి దించగా.. అప్పుడు ఈరన్న టిడిపి అభ్యర్థిగా గెలిచారు.. అయితే 2018లో వైసీపీ తిప్పేస్వామిని ఎంపికైనట్టుగా కోర్టు ప్రకటించిందట. ఆ తర్వాత 2019లో అభ్యర్థి ఈరన్న పైన తిప్పేస్వామి గెలిచారు.


ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీల బలాల విషయానికి.. అధికార పార్టీ సంక్షేమ పథకాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంది. అలాగే రైతు భరోసా కేంద్రాలు,  ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాల ఏర్పాటు గెలుపుకి నాంది పలకనున్నాయి.


మరోవైపు అభివృద్ధి జరగలేదని.. కార్యకర్తలకు న్యాయం జరగలేదని.. కొత్త వారికి అవకాశం ఇస్తే నష్టం జరిగే ప్రమాదం ఉందనే విషయాలు వైసిపి పార్టీకి మైనస్ గా మారనున్నాయి.


ఈసారి 2024 ఎన్నికలలో వైసిపి అభ్యర్థిగా ఈరలక్కప్ప నిలబడుతున్నారు. దీంతో గత వైసిపి అభ్యర్థి నుంచి సహాయ నిరాకరణ అందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈరలక్కప్ప కు ఈయనకు సొంత మండలంలో తప్ప ఇతరచోట మైనసేనట. సాధారణ కార్యకర్తకు సీటు ఇవ్వడం కేవలం గొప్పగా చెప్పుకోవడానికి తప్ప.. గెలుపుకు హామీ కాదని స్థానిక వైసిపి నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.


టిడిపి అభ్యర్థి ఎంవి సునీల్ కుమార్  విషయానికి వస్తే.. గతంలో టిడిపి గెలిచినప్పుడు ఉన్న అభివృద్ధి.. అలాగే వైసిపి పాలన పట్ల ఉన్న ప్రజలలో అసంతృప్తి ప్లస్ పాయింట్ గా మారింది . గత ఎన్నికలలో టిడిపి ఓటమి వల్ల ఏర్పడే సానుభూతి కూడా ఎక్కువగా వచ్చేలా ఉందనీ టిడిపి వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.

అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా గట్టిగానే ప్రయత్నిస్తోంది..అలాగే వైసిపి ,టిడిపిలో గ్రూపు తగాదాలు ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా  మారుతాయి అని అక్కడి విశ్లేషకులు తెలుపుతున్నారు.

వైసీపీ ప్రభుత్వంలో గత నాలుగున్నరేళ్ళుగా.. చిన్నచిన్న రోడ్లు, గుంతలు పూడ్చడం, శంకుస్థాపనలు మాత్రమే జరిగాయని నియోజవర్గ వ్యాప్తంగా అభివృద్ధి శూన్యమని అభిప్రాయం ఉన్నది. మరి అక్కడ ప్రజలు ఎమ్మెల్యేను మారుస్తారా?లేకపోతే ప్రజలే ప్రభుత్వాన్ని మారుస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: