ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా.. ప్రధాన పార్టీలు సైతం తమ తమ వ్యూహాలతో దూసుకుపోతున్నారు. కేంద్రంలో ఎవరు వస్తారు? రాష్ట్రంలో అధికారం ఎవరు చేపడతారు..? నియోజవర్గాలలో కూడా ఎవరు అధికారం చేపడతారన్న విధంగా కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఆ గడ్డ పరిటాల అడ్డ అని చెప్పుకునే రాప్తాడు నియోజకవర్గం కొన్ని దశాబ్దాలుగా టిడిపి పార్టీనే జెండా ఎగరేస్తోంది. అయితే 2019లో మాత్రం తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విజయాన్ని అందుకున్నారు. మరి ఈసారి 2024 ఎన్నికలు ఎలా ఉండబోతాయో చూద్దాం.


ఇండియా హెరాల్డ్ కి అందుతున్న సమాచారం మేరకు.. ఈసారి రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అభ్యర్థిగా.. గెలిచేందుకు 57% అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.. టిడిపికి 34%.. జనసేన 5%.. బిజెపికి..0.57%.. కాంగ్రెస్ అయితే 1.05% .. ఇక ఇతరులు కలుపుకొని మొత్తం అంతా వన్ పర్సంటేజ్ ఉన్నదట.. ఈ ప్రకారం చూసుకుంటే అక్కడ ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ జెండానే ఎగురుతుంది.. 2019లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 25 వేల మెజార్టీ ఓట్లతో గెలిచారు. అయితే ఇదంతా సింగిల్ గా పోటీ చేస్తే పార్టీ యొక్క పరిస్థితి..

2014లో టిడిపి పార్టీ నుంచి సునీతమ్మ స్వల్ప మెజార్టీతో గెలిచింది.. అయితే ఎప్పుడు పోటీ చేసినా కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద స్వల్ప మెజారిటీతోనే పరిటాల కుటుంబం గెలుస్తూ ఉండేదట. అనుకున్నట్టుగానే పెరవలి డ్యామ్ కు నీళ్లు ఇచ్చారు.. ఆరు రిజర్వాయర్లకు శంకుస్థాపన కూడా చేశారు. పేద ప్రజలకు కూడా అండగా ఉన్నారు.. సంక్షేమ పథకాలను కూడా అందరికీ అందించేలా చేశారు. అయితే కూటమిలో భాగంగా పోటీ చేస్తే.. వైఎస్ఆర్ సీపీకి 55% ఓటు శాతం ఉన్నదట.. టిడిపి , జనసేన పొత్తులో భాగంగా 40% ఓటింగ్ వస్తుంది..అయితే ముఖ్యంగా రైతులకు ఉచిత బోర్లు వంటివి వేయించడమే కాకుండా గిట్టుబాటు ధరలు , ఉచిత సిలిండర్లు మేనిఫెస్టోలో ఉండే పథకాలనే కాకుండా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్వయంగా కొన్నిటిని చేశారట.


తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి  అక్కడ ప్రజలలో 52% ఓటింగ్ ఉంటుందట.. ఇక పరిటాల శ్రీరామ్ కి 11%.. సునీతమ్మకు 27%.. ఓటింగ్ పడే అవకాశం ఉంటుంది. 2019లో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మీద ఓడిపోయిన శ్రీరామ్ ఈ నియోజకవర్గం వదిలి ధర్మవరం కు వెళ్లడం పెద్ద తప్పు. అయితే ఓడిపోయిన చోటే గెలవాలనుకోకుండా.. ధర్మవరంలో తమ కుటుంబానికి పట్టు ఉందని.. అక్కడికి వెళ్లడం పరిటాల కుటుంబం చేసిన పెద్ద తప్పు. దీంతో ఒక్కసారిగా రాప్తాడులో పరిటాల కుటుంబం పట్టు కోల్పోయిందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈసారి కూడా వైసీపీకే అక్కడ ప్రజలు పట్టంకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: