రాజకీయాల్లో బంధాలు, రక్త సంబంధాలు ఉండవు. రంగంలోకి దిగామంటే తండ్రి అయిన  తల్లైనా చెల్లైనా ఎవరైనా సరే ప్రత్యర్థులే. ఎవరి గెలుపు కోసం వారే ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు భీమిలి నియోజకవర్గంలో కూడా  ఇదే పోరు నడుస్తోంది. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే కాకుండా గురు శిష్యులు అని చెప్పవచ్చు.  2009 సమయంలో అవంతి మరియు గంట  ఇద్దరు నాయకులు విశాఖ జిల్లా నుంచి ఎన్నికయ్యారు.  ఒకరు భీమిలి నుంచి అవంతి శ్రీనివాస్ ఎన్నిక కాగా, అనకాపల్లి నుంచి గంట శ్రీనివాస్ గెలుపొందారు.  ఇదే సమయంలో గంటకు చిరంజీవితో మంచి బంధుత్వం ఉండడంతో కిరణ్ కుమార్ క్యాబినెట్ లో మంత్రి పదవి  పొందారు. ఈ విధంగా ఒకే కంచంలో తినే వీరు  ఎప్పుడు విడిపోయారు అనే విషయానికి వస్తే..

రాష్ట్రం తెలంగాణతో విడిపోయిన తర్వాత  అవంతి, గంట ఇద్దరు కలిసి టీడీపీలో జాయిన్ అయ్యారు.  ఇదే టైంలో అవంతి ఎంపీగా టిడిపి నుంచి పోటీ చేసి గెలిచారు.  ఆ తర్వాత గంట భీమిలి నుంచి పోటీ చేసి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు. ఈ విధంగా కలిసి ఉన్నటువంటి వీరీ మధ్య టిడిపి పార్టీలో ఉన్నప్పుడే గ్యాప్ మొదలైంది. దీంతో మనసు మార్చుకున్నటువంటి అవంతి వైసీపీ పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో  భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. జగన్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. ఇలా విశాఖ జిల్లాలో చక్రం తిప్పుతున్న ఈ ఇద్దరు నేతలు ఇప్పటివరకు ఓటమి పొందలేదు. కానీ మొదటిసారి ఇద్దరు గట్టి ప్రత్యర్థుల మధ్య పోటీ ఏర్పడింది. పోటీ అంటే ఒకరు గెలవాలి మరొకరు ఓడిపోవాలి. అంతేకాకుండా ఈ ఇద్దరికీ భీమిలి నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. ఒకే సామాజిక వర్గం. దీంతో ఇక్కడి ఓటర్లు ఎవరిని ఆదరించాలో ఎవరిని పక్కన పెట్టాలో కాస్త అయోమయంలో పడ్డట్టు తెలుస్తోంది. అక్కడ బీసీ  ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

 ఈ క్రమంలోనే టిడిపి నుంచి పోటీ చేస్తున్నటువంటి గంటా శ్రీనివాస్ పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నారు.  ఇందులో జనసేన, బీజేపీతో పాటు టీడీపీ  కలిసి ఉండడంతో బీసీ సామాజిక వర్గం ఓట్లన్నీ  గంట వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే అవంతి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో జగన్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ భీమిలిలో దూసుకుపోతున్నారు. ఈ విధంగా ఇద్దరు రాష్ట్ర స్థాయి అపజయం ఎరుగని నేతల మధ్య  ఈసారి పోరు జరుగుతుంది. ఈ పోరులో  విజయం సాధించేదెవరు.. అపజయం పొందేది ఎవరు అనేది చాలా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: