ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మక రాజకీయ చతురత కలిగిన జిల్లా గుంటూరు. ఈ జిల్లాలోని మొత్తం నియోజకవర్గాల్లో గుంటూరు ఈస్ట్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇక్కడ గత కొన్ని ఏళ్లుగా ముస్లిం మైనారిటీకీ సంబంధించిన వ్యక్తులే ప్రాతినిధ్యం   వహిస్తున్నారు. అలాంటి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఈసారి ఏ పార్టీ జెండా పాతబోతోంది. ముక్కోనపు పోరులో విజయం సాధించేదెవరు అనే వివరాలు చూద్దాం.. గుంటూరు ఈస్టులో  ముస్లిం ఓట్లే అధికంగా ఉంటాయి. ఇక్కడ ఎస్సీ, వైశ్యులు, కాపులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. గెలుపోవములు నిర్ణయించేది ముస్లిం ఓటు బ్యాంకు మాత్రమే.

 అలాంటి ఈ నియోజకవర్గంలో 1983 నుంచి ముస్లిం అభ్యర్థులే విజయదుందుభి మోగిస్తూ వస్తున్నారు. అలాంటి ఈ నియోజకవర్గంలో ఈసారి ముక్కోనపు పోటీ ఏర్పడింది. మరి ఈ పోటీలో  వైసిపి హైట్రిక్ కొడుతుందా.? టిడిపి అదృష్టాన్ని పరీక్షించుకుంటుందా.? టిడిపి, వైసిపి ఓట్ల చీలికలో కాంగ్రెస్  బయటపడుతుందా.? ప్రస్తుతం గుంటూరు ఈస్ట్ లో  2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన షేక్ మస్తాన్ వలి విజయం సాధించారు. ఆ టైంలో టిడిపి మూడవ స్థానంలోకి వచ్చింది.  ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక ఈయన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన షేక్ ముస్తఫా విజయం అందుకున్నారు.

అయితే ఈసారి ముస్తఫా పోటీలోంచి తప్పుకొని తన కూతురు నూరి ఫాతిమాను రంగంలోకి దించాడు. ఈ క్రమంలోనే 2019లో టీడీపీ నుంచి గట్టి పోటీ ఇచ్చిన మహమ్మద్ నజీర్ మరోసారి బరిలో నిలిచారు. అలాగే కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలి  బరిలో ఉన్నారు.ఈ విధంగా ముగ్గురు నేతలు  గుంటూరు ఈస్ట్ లో మంచి పేరున్న నాయకులే. మరి ఈ త్రిముఖ పోరులో  ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది  చాలా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ టిడిపి వైసిపి మధ్య గట్టి పోటీ ఏర్పడి ఓట్లు చీలిపోతే మాత్రం, కాంగ్రెస్ అభ్యర్థి బయటపడిన ఆశ్చర్యపోనవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: