పిఠాపురం, మంగళగిరి నియోజకవర్గాలు సెగలు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక, మంగళగిరి నుంచి నారా లోకేష్ వరుసగా రెండో సారి బరిలోకి దిగారు.వీరు గత 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వారే కావడం గమనార్హం. అయినా కానీ తమ పార్టీలను నడిపిస్తున్నారు. పవన్ తన సొంత పార్టీ జనసేనను నడిపిస్తుండగా.. నారా లోకేష్ టీడీపీలో నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. దీంతో ఇప్పుడు వీరికి గెలుపనేది అనివార్యంగా మారింది.అయితే.. వీరి గెలుపు అనుకున్నంత సులభం మాత్రం కాదు. ఎందుకంటే ప్రత్యర్థి, అధికార పార్టీ వైసీపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఎన్నో సమీకరణల తర్వాత.. ఈ రెండు నియోజవర్గాల్లో కూడా బలమైన నాయకులను దింపింది.ఇక పిఠాపురం నుంచి కాపు నాయకురాలు.. ఎంపీ వంగా గీత బరిలో నిలవగా మంగళగిరి నుంచి రెండు బలమైన కుటుంబాలకు చెందిన మురుగుడు లావణ్యను రంగంలోకి దింపారు. వీరి గెలుపు కోసం.. వైసీపీ నిరంతరం సమీక్షలు చేస్తోంది. కనీసం పదినిమిషాలు కూడా.. అభ్యర్థులను నిద్రపోనివ్వడం లేదు.


అయితే.. ఇక్కడ వైసీపీ గెలుపు కూడా అంత ఈజీ కాదు.అటు పిఠాపురంలో పవన్ వర్సెస్ గీత అయినా.. ఇటు మంగళగిరిలో నారా లోకేష్ వర్సెస్ మురుగుడు లావణ్య అయినా.. గెలుపు కోసం కష్టపడాల్సిందే. ఈ క్రమంలో పవన్  వెనుకబడ్డారనే వాదన ఉన్నా.. మరో 30 రోజుల దాకా ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆయన పుంజుకుంటారనే వాదన ఉంది. కానీ.. పోటీ మాత్రం ఈ రెండు నియోజకవర్గాల్లో చాలా చాలా బలంగా ఉంది. పిఠాపురంలో వైసీపీ నలుగురు ముఖ్య నేతలను రంగంలొకి దింపింది.ఈ పరిస్థితి జనసేన పార్టీలో కనిపించడం లేదు. కేవలం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వర్మపైనే ఆధారపడ్డారు. ఇతను గత ఎన్నికల్లో ఓడిపోయారు. పైగా క్షత్రియ సామాజికవర్గంలో గొడవలు వచ్చి.. నానా తిప్పలు పడుతున్నారు. ఇక, మంగళగిరిలో కూడా వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, బీసీ నేతటికెట్ ఇచ్చి కూడా వెనక్కి తీసుకున్న గంజి చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పనిచేస్తున్నారు. మరి చూడాలి పిఠాపురం, మంగళగిరిలో ఎవరు నెగ్గుతారో..

మరింత సమాచారం తెలుసుకోండి: