ప్రస్తుతం భారతదేశంలో 2024 పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. దానికంటే ముందు పోలింగ్ దశల విషయానికి వస్తే, ఇప్పటికే 102 స్థానాలకు తొలి దశ పోలింగ్‌ జరిగింది. రెండో దశ ఈ నెల 26న జరగనుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నాలుగో దశ మే 13న జరగనుంది. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నెల 25వ తేదీతో నామినేషన్లకు గడువు ఉంది.

* అత్యంత సంపన్న అభ్యర్థులు

ఎంపీల అఫిడవిట్‌ల ఆధారంగా, తెలుగు రాష్ట్రాల్లో పలువురు అభ్యర్థులు అత్యంత సంపన్నులుగా నిలుస్తారు. రూ.5,598.65 కోట్ల ఆస్తులతో పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు టీడీపీ అభ్యర్థి) అగ్రస్థానంలో ఉన్నారు. ఈయన భారతదేశంలో అత్యంత ఎక్కువ సంపద ఉన్న ఎంపీగా నిలుస్తున్నారు. ఇక మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థి) రూ.4,568 కోట్లతో సెకండ్ రిచెస్ట్ ఎంపీగా అవతరించారు.

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి) రూ.715.62 కోట్ల ఆస్తులతో తర్వాతి స్థానంలో ఉన్నారు. వైఎస్ షర్మిల (కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థి) రూ.132.56 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. మరో ప్రముఖ అభ్యర్థి, మొత్తం రూ.182 కోట్ల ఆస్తులతో 5వ స్థానంలో కొనసాగుతున్నారు. మరి కొద్ది రోజుల్లో మరి కొంతమంది కీలక నేతలు తమ ఆస్తుల విలువలపై వెలుగునిస్తూ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

ఇకపోతే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏపీలో మే 13వ తేదీన జరగనున్నాయి అసెంబ్లీ అభ్యర్థులుగా నిలుచున్న నాయకులు కూడా వందల కోట్ల ఆస్తులతో అత్యంత ధనికులుగా కనిపిస్తున్నారు. చివరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలో కూడా రూ.800 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న లోకం మాధవి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. కొందరు ఏపీలో వైసీపీ గెలుస్తుంది అని అంటుంటే, తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ఇంకొందరు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: