ఆంధ్రా విద్యారంగంలో పలు కీలక మార్పులు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం తాజాగా ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతిని గురించి మీరు వినే వుంటారు. ఈ విషయమై వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సమక్షంలో ఏపీ ప్రభుత్వ అధికారులు, ఎడ్‌క్స్‌ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ విద్యా రంగంలో పెను మార్పులు సంభవించబోతున్నాయని చెప్పుకొచ్చారు. నాణ్యమైన విద్యను అదించడంలో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, ప్రపంచంతో పోటీపడడానికి మన తెలుగు పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి అని కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఇకపోతే, కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యారంగ నిపుణులు అనేకమంది ఇపుడు మీడియా ముందుకి వచ్చి మాట్లాడుతుండడం శుభపరిణామం. విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు తీసుకొచ్చే దిశగా జగన్ పాటుబడుతున్నాడని వారు అభిప్రాయపడుతున్నారు. మానవవనరుల మీద పెట్టుబడి అన్నది ఒక ప్రధాన అంశంగా జగన్ ప్రభుత్వం ముందుకు పోతోంది అని పలువురు విశ్లేషకులు చెప్పుకు రావడం గమనార్హం. కాగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశ పెట్టిన ఘనత కూడా జగన్ ప్రభుత్వానిదేనని చెప్పుకొస్తున్నారు. అవును, గ్లోబల్‌ సిటిజన్‌ కావాలంటే మన మాట్లాడే భాషలో మార్పులు, చేర్పులు రావలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఇకపోతే జగన్ హయాంలో ఇంగ్లీషు మీడియం నుంచి నాడు-నేడు, అమ్మ ఒడి, గోరుముద్దతో ఆంధ్రా విద్యా వ్యవస్థలో పెను మార్పులే సంభవించాయి. అయితే అక్కడితో ఆగిపోకుండా వచ్చే పదేళ్లలో టెన్త్‌ విద్యార్థి దశనుండే ఐబీ విద్యాబోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నట్టు సీఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను ఆన్‌‌లై‌న్ ద్వారా అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ “ఎడెక్స్”ల మధ్య ఒప్పందం కుదిరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను సంయుక్తంగా ఎడెక్స్ మరియు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ రూపొందించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: