ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగ్గా ఎన్నికల సమయంలో ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చిన జగన్ ఆ ఇంటర్వ్యూతో ఏపీ పొలిటికల్ లెక్కల్ని మార్చేశారా? అనే ప్రశ్నకు ఎలాంటి సందేహం అవసరం లేకుండా అవునని సమాధానం చెప్పవచ్చు. ఈ ఇంటర్వ్యూతో జగన్ న్యూట్రల్ ఓటర్ల మనస్సు గెలుచుకోవడంతో పాటు ఐదేళ్ల పాలనలో ఎదురైన ప్రతి విమర్శకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చి విమర్శకులను సైతం మెప్పించారు.
 
ఏపీలో అభివృద్ధి జరగలేదని కామెంట్లు చేసేవాళ్ల నోర్లను జగన్ తన సమాధానాలతో మూయించారనే చెప్పాలి. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి జగన్ ఇచ్చిన వివరణతో ఇప్పటివరకు విమర్శలు చేసిన వాళ్లు సైతం నోరు మూయక తప్పదు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లకు ఒరిజినల్స్ ఇవ్వరనే ప్రచారానికి సైతం జగన్ చెక్ పెట్టేశారు. బాబు ప్రతి పాపంలో పవన్ కు భాగస్వామ్యం ఉందంటూ జగన్ పవన్ పరువు తీసేశారు.
 
జగన్ ఇంటర్వ్యూ వ్యూస్ పరంగా, రేటింగ్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించి టీవీ ఛానెళ్లలోనే సంచలనం అయిందని తెలుస్తోంది. జగన్ క్రేజ్ కు ప్రూఫ్ ఇదేనని ఆయన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోకు మిలియన్ వ్యూస్ వచ్చాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో ప్రసారమైన చంద్రబాబు ఇంటర్వ్యూకు నామమాత్రపు స్థాయిలో కూడా రెస్పాన్స్ రాలేదు. ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా జగన్ ఇంటర్వ్యూ గురించి చర్చ జరుగుతోంది.
 
చెల్లెళ్లకు న్యాయం చేయడం అంటే మరొకరికి అన్యాయం చేయడం కాదని జగన్ చేసిన కామెంట్స్ ఆకట్టుకున్నాయి. ముస్లిం రిజర్వేషన్లకు తాను భరోసా ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మళ్లీ వైసీపీదే అధికారం అని నమ్మకాన్ని కల్పించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. జగన్ మళ్లీ సీఎం అయితే మాత్రమే ఏపీ అభివృద్ధి అని ఆయన కామెంట్ల ద్వారా అర్థమవుతోంది. జగన్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సుధీర్ఘ ఇంటర్వ్యూతో జగన్ ఏపీ ఓటర్ల మనస్సు గెలుచుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ అంటే ప్రజల దృష్టిలో ఒక బ్రాండ్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: