ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరు. ఇక్క‌డ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. పైగా పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ ఆయ‌న‌కు తిరుగులేద‌ని అంటారు. స్థానికంగా కూడా.. కుల బ‌లం, కుటుంబ బ‌లం రెండూ కూడా ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చాయి. ఇక‌, పార్టీ కేడ‌ర్ ప‌రంగానూ పుంగ‌నూరులో పెద్దిరెడ్డికి క‌లిసి వ‌స్తోంది. అయితే.. ఇది నిన్న‌టి మాట ఇప్పుడు ఇక్క‌డి ఈక్వేష‌న్లు మారిపోయాయి.


యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన బోడే రామ‌చంద్ర‌యాద‌వ్ బ‌లంగా దూసుకుపోతున్నారు. సొంత పార్టీ భార‌త చైత‌న్య యువ‌జ‌న పార్టీ పెట్టుకుని ఆ పార్టీ త‌ర‌ఫున ఆయ‌న ఇక్క‌డ, మంగ‌ళ‌గిరిలోనూ పోటీ చేస్తు న్నారు. అయితే.. మంగ‌ళ‌గిరి కంటే కూడా.. పుంగ‌నూరుపైనే ఎక్కువ‌గా దృష్టిపెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి అరాచ‌కాల‌పై ఆయ‌న పోరు చేస్తున్నారు. వాస్త‌వానికి గ‌తంలోనూ పెద్దిరెడ్డిపై అనేక మంది నాయ‌కులు పోరాటం చేసినా.. బోడే త‌ర‌హాలో పోరాటాలు చేసిన వారు లేర‌నే చెప్పాలి.


కేంద్రంలోని పెద్ద‌ల‌తో స‌త్సంబంధాలు పెట్టుకుని.. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డంలో బోడే స‌క్సెస్ అయ్యారు. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన త‌ర్వాత కూడా.. పెద్దిరెడ్డికి అనుకూలంగాఉన్న డీఐజీ నుంచి ఎస్పీ, ఎస్సై స్థాయి అధికారుల‌ను కూడా బ‌దిలీ చేయించిన ఘ‌న‌త బోడేకే ద‌క్కుతుంది. దీంతో అక్ర‌మాల‌కు దాదాపు అడ్డుక‌ట్ట వేసిన‌ట్టేన‌ని చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో పుంగనూరులో పెద్దిరెడ్డిని ఎదిరించి నైతికంగా ఆయ‌న తొలి విజ‌యం సాధించారు.


ఇక‌, ప్ర‌చారంలోనూ పెద్దిరెడ్డి పాపాలు అంటూ.. బోడే రామ‌చంద్ర‌యాద‌వ్ విరుచుకు ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మయ్యేలా వివ‌రిస్తున్నారు. ఇక్క‌డ మార్పు వ‌స్తే త‌ప్ప‌.. జిల్లా వ్యాప్తంగా అరాచ‌కాల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌ద‌ని కూడా వివ‌రిస్తున్నారు. దీనికితోడు బీసీల‌ను ఐక్యం చేయ‌డం. యాద‌వ సామాజిక‌వర్గాన్ని పూర్తిగా త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోనూ బోడే స‌క్సెస్ అయ్యారు. ఏ కోణంలో చూసుకున్న రామ‌చంద్ర‌యాద‌వ్ నైతికంగా అయితే.. విజ‌యం ద‌క్కించుకున్నారు. మ‌రి ఓట‌రు తీర్పు ఎలా ?ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: