ఆంధ్రా ఎన్నికల్లో ఇప్పుడు పిఠాపురం శాసనసభ స్థానం హాట్ సీట్ గా మారింది. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయాడు.ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో గెలుపు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు జీవన్మరణ సమస్య. అందుకే ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టి కూడా పిఠాపురం మీదనే ఉంది.పిఠాపురంలో మొత్తం 2.29 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 115,717 మంది పురుషులు ఇంకా 113,869 మంది మహిళలు ఉన్నారు. ఇక ఇక్కడ కాపు ఓటర్లు సుమారు 75 వేల మంది, ఎస్సీలు 28 వేల మంది ఉన్నారు. ఎస్సీలలో మాలలు 20 వేలు, మాదిగలు 8 వేల దాకా ఉన్నారు. 23 వేల మంది శెట్టి బలిజ, మత్స్యకారులు 17 వేలు, పద్మశాలి, 16 వేలు, రెడ్లు 10 వేల మంది, కొప్పుల వెలమ 9 వేలు, తూర్పు కాపు 7 వేలు ఇంకా అలాగే క్షత్రియ 6 వేల మంది ఉన్నారు.ఈ నేపథ్యంలో పవన్ గెలుపులో కాపులది ఖచ్చితంగా కీలకపాత్ర.


అయితే అధికార వైసీపీ  కాపు సామాజిక వర్గానికే చెందిన కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలోకి దించారు. 2009 వ సంవత్సరంలో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వంగా గీత, 2019 సంవత్సరంలో కాకినాడ నుండి వైసీపీ ఎంపీగా గెలిచింది.పవన్ కళ్యాణ్ గెలుపుకోసం టాలీవుడ్ చిన్న, పెద్ద నటులు, జబర్దస్త్ నటులు కూడా ప్రచారానికి దిగారు. పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు అక్కడే ఉండి ఎన్నికల వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నాడు. ఎన్నికల ప్రచారం చివరి రోజు మెగాస్టార్ చిరంజీవి రావాల్సి ఉండగా ఆఖరు నిమిషంలో క్యాన్సిల్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన కొడుకు మరో మెగా హీరో రాంచరణ్ ప్రచారం చేస్తున్నాడు.చివరి రోజు ప్రయాణానికి వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిఠాపురం అభ్యర్థి వంగా గీత తరపున ప్రచారం చేశారు. పవన్ ఎన్నికల తర్వాత అందుబాటులో ఉండడు. గీత అందుబాటులో ఉంటుంది. అందుకే అందుబాటులో ఉన్న వారికే ఓటువేయాలన్న చర్చ పిఠాపురంలో నడుస్తుంది.


అయితే ఈసారి పవన్ గెలిచే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే పిఠాపురం అభివృద్ధి పరంగా వెనకపడిపోయింది. అక్కడ సినీ సెలబ్రిటీల గ్లామర్, షూటింగ్స్ తప్ప ఏమి లేదు. అక్కడ ప్రజలు పేదరికంతో మగ్గుతున్నారు. చాలా మంది ఇల్లులు లేక సముద్రం దగ్గరలో మురికి వాడల్లో పేదరికం అనుభవిస్తున్నారు. గతంలో వైసీపీ, టీడీపీ పార్టీలు గెలిచినా కూడా ఏమాత్రం అభివృద్ధి చెయ్యలేదు. రాజకీయ నాయకులు ప్రజలకు అబద్దపు ప్రమాణాలు చేశారే తప్ప అక్కడ ప్రజల జీవితాలని మార్చలేదు. అక్కడ రోడ్లు సరిగ్గా ఉండవు. తాగు నీటి వసతి లేదు. సరైన స్కూల్లు లేవు. పేదలకు ఇల్లులు లేవు. ఎక్కడ చూసిన మురికివాడలే కనిపిస్తాయి.మరి పవన్ కళ్యాణ్ అయినా గెలిచి పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాడో లేడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: