కేకే సర్వే ప్రకారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అనే విషయాలను క్లియర్గా తెలుసుకుందాం. మొదటగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు నియోజకవర్గ విషయానికి వస్తే వస్తే ఇక్కడి నుండి కూటమి అభ్యర్థిగా పార్థసారధి గారు పోటీలోకి దిగగా వైసిపి పార్టీ అభ్యర్థిగా వెంకట ప్రతాపరావు గారు వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగబోతున్నారు. ఇక్కడ హోరాహోరి పోరిగే జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూటమి అభ్యర్థి అయినటువంటి పార్థసారధికే గెలుపు కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు కేకే సర్వే నివేదించింది.

కృష్ణాజిల్లాలో నుండి రెండవ నియోజకవర్గం కైకలూరు. ఇక్కడి నుండి కూటమి అభ్యర్థిగా కామినేని శ్రీనివాసరావు గారు పోటీలోకి దిగుతూ ఉండగా దూలం నాగేశ్వరరావు గారు వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగబోతున్నాడు. ఇక ఇక్కడ భారీ ఫైట్ నెలకొనే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందో చివరి నిమిషం వరకు చెప్పలేము అని కేకే సర్వే తెలియజేసింది. ఇక కృష్ణాజిల్లాలో మరొక నియోజకవర్గం తిరువూరు. ఇక్కడి నుండి కూటమి అభ్యర్థిగా శ్రీనివాసరావు గారు పోటీలోకి దిగుతుండగా నల్లగట్ల స్వామి దాసు గారు వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగబోతున్నారు.

ఇది కూడా టాప్ ఫైట్ నియోజకవర్గంగా కేకే సర్వే చెప్పుకొచ్చింది. కృష్ణాజిల్లాలో మరో నియోజకవర్గం విజయవాడ వెస్ట్. ఇక్కడే నుండి కూటమి అభ్యర్థిగా సృజన చౌదరి పోటీలోకి దిగుతూ ఉండగా , షేక్ ఆసిఫ్ గారు ఇక్కడ వైసిపి పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగబోతున్నారు. ఇక్కడ కూడా పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగే అవకాశం ఉన్నట్లు కేకే సర్వే చెప్పకు వచ్చింది. ఇక నెక్స్ట్ విజయవాడ ఈస్ట్ ఇక్కడ కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ రావు గారు కూటమి అభ్యర్థిగా పోటీలోకి దిగుతుండగా దేవినేని అవినాష్ వైసీపీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

ఇక కేకే సర్వే ప్రకారం ఇక్కడ కూటమి అభ్యర్థి రామ్మోహన్ రావు గెలిచే అవకాశం ఉంది. ఇక విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే బోండా ఉమా మహేష్ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉండగా, వేల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కేకే సర్వే ప్రకారం బోండా ఉమా గారు గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నాయి. ఇక మైలవరం నియోజకవర్గం విషయానికి వస్తే వసంత కృష్ణ ప్రసాద్ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉండగా , వైసిపి నుండి తిరుపతిరావు పోటీలో ఉన్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు కేకే సర్వే చెప్పుకొచ్చింది.

ఇక నందిగామ నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా మొండితోక జగన్మోహన్రావు పోటీలో ఉండగా, టిడిపి పార్టీ అభ్యర్థిగా సౌమ్య పోటీలో ఉంది. ఇక ఇక్కడ కూటమి అభ్యర్థి సౌమ్య గెలిచే అవకాశాలు ఉన్నట్లు కేకే సర్వే చెప్పుకొచ్చింది. జగ్గయ్యపేట నుండి సామినేని ఉదయభాను వైసీపీ నుండి శ్రీరామ్ రాజగోపాల్ టిడిపి నుండి పోటీ చేస్తున్నారు. ఇక ఇక్కడి సీట్ కూటమి గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నట్లు కేకే సర్వే నివేదించింది. గన్నవరం నుండి వల్లభనేని వంశీ వైసిపి నుండి పోటీ చేస్తూ ఉండగా, యార్లగడ్డ వెంకట్రావు టిడిపి నుండి పోటీ చేస్తున్నాడు.

ఇక్కడ కూటమి అభ్యర్థి వెంకట్రావు గెలిచే అవకాశాలు ఉన్నట్లు కేకే సర్వే చెప్పుకొచ్చింది.  గుడివాడ నుండి కొడాలి నాని వైసిపి పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండగా, రాము  కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వీరి మధ్య పోటీ భారీగా ఉండే అవకాశాలు ఉన్నట్లు కేకే సర్వే చెప్పుకొచ్చింది. ఇక కృష్ణాజిల్లాలోని పెడన నియోజకవర్గం నుండి ఉప్పల రాము వైసీపీ నుండి పోటీ చేస్తూ ఉండగా, కాగిత కృష్ణ ప్రసాద్ కూటమి నుండి పోటీ చేస్తున్నాడు. ఇక్కడి నుండి కాగిత కృష్ణ ప్రసాద్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు కేకే సర్వే నివేదించింది. అవనిగడ్డ నుండి సింహాద్రి రమేష్ వైసిపి పార్టీ నుండి పోటీ చేస్తూ ఉండగా , మండల బుద్ధ ప్రసాద్ టిడిపి నుండి పోటీ చేస్తున్నాడు. ఇక్కడ గట్టి పోటీ ఉండనున్నట్లు కేకే సర్వే చెప్పకు వచ్చింది.

పెనమలూరు నుండి జోగి రమేష్ వైసిపి పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉండగా బోడె ప్రసాద్ టిడిపి అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. ఇక్కడ టిడిపి అభ్యర్థి బోడ ప్రసాద్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు కే కే సర్వే చెప్పుకొచ్చింది. పామర్రు నియోజకవర్గ నుండి అనిల్ కుమార్ వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగనుండగా , వర్ల కుమార్ రాజా కూటమి అభ్యర్థిగా పోటీలోకి దిగబోతున్నాడు. ఇక ఇక్కడ మాత్రం వైసిపి పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ గెలిచే అవకాశం ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం పదహారు నియోజకవర్గాలు ఉంటే ఇక ఇందులో 11 కూటమి గెలుస్తుంది అని, ఒకటి వైసీపీ గెలుస్తుంది అని నాలుగు నియోజకవర్గంలో గట్టి పోటీ ఉండబోతుంది అని కేకే సర్వే నివేదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: