బాపట్ల పార్ల‌మెంటు స్థానంలో ఈ ద‌ఫా టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబు తున్నారు. వాస్త‌వానికి ఇది వైసీపీకి సిట్టింగ్ స్థానం. ప్ర‌స్తుత ఎంపీ నందిగం సురేష్ ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా రెండో సారి బ‌రిలోఉన్నారు. ఇక‌, టీడీపీ నుంచి తెన్నేటి కృష్ణ ప్ర‌సాద్ బ‌రిలో నిలిచారు. ఇది ఎస్సీ నియోజ క‌వ‌ర్గం. తెన్నేటి కృష్ణ ప్రసాద్ రిటైర్డ్ పోలీసు అధికారి. పైగా.. టీడీపీ నాయ‌కురాలు శ‌మంత‌క‌మ‌ణికి స్వ‌యానా అల్లుడు.


ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. అయితే.. బాప‌ట్ల‌లో వ్య‌క్తుల, నాయ‌కుల బ‌లం క‌న్నా కూడా.. పార్టీలు.. అవి అనుస‌రించిన విధానాలు బ‌లంగా ప్ర‌భావితం చూపుతున్నాయ‌ని అంటున్నా రు ప‌రిశీల‌కులు. రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం రైతులు ఉద్య‌మించిన స‌మ‌యంలో ఎంపీ నందిగం సురేష్ వారిని వేధించేలా కార్య‌క్ర‌మాలు చేశార‌నే వాద‌న ఇప్ప‌టికీ ఉంది. ప్ర‌త్యామ్నాయంగా మూడు రాజ‌ధాను ల‌కు మ‌ద్ద‌తుగా .. ఇక్క‌డ శిబిరాలు వేయించి ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేయించారు.


ఇది .. రైతులు ఇప్ప‌టికీ మ‌రిచిపోలేక పోతున్నారు. దీంతో నందిగం సురేష్‌ను ఓడించేందుకు వారంతా సైలెంట్ ప్ర‌చారం చేస్తున్నారు. ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్తి కొత్తా.. పాతా.. అనే విష‌యం ప్ర‌స్తావ‌న‌కు లేదు. కేవ‌లం నందిగంను ఓడించాల‌న్న చ‌ర్చే ఎక్కువ‌గా ఉంది. ఇక‌, ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ప‌రుచూరు, అద్దంకి, చీరాల‌, రేప‌ల్లె, బాప‌ట్ల వంటి వాటిలో ఈ ద‌ఫా టీడీపీ విజ‌యం ఖాయ‌మ‌ని చ‌ర్చ సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లోనూ అద్దంకి, చీరాల‌, రేప‌ల్లె ల‌ను టీడీపీ కైవ‌సం చేసుకుంది.


ఇప్పుడు కూడా.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ బ‌లంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపీ ఓటు కూడా.. టీడీపీకే ప‌డ‌నుంద‌ని అంటున్నారు టీడీపీ నేత‌లు. ఇక‌, వేమూరులో ట‌ఫ్ ఫైట్ ఉన్నా.. ఈ ద‌ఫా టీడీపీనేత న‌క్కా ఆనంద‌బాబుకు ప్ర‌జ‌లు జై కొడ‌తార‌ని చెబుతున్నారు. దీంతో ఇక్క‌డ కూడా.. ఎంపీ ఓటు టీడీపీ కేప‌డుతుంద‌ని అంచ‌నా. ఇలా.. నాలుగునుంచి ఐదు నియోజ‌క‌వ‌ర్గాల‌లో వైసీపీ వ్య‌తిరేక‌త టీడీపీ ఎంపీ అభ్య‌ర్థికి క‌లిసి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: