- ఏపీ విద్యావ్యవస్థలో అద్భుతాలు.
- అధికారులు మెచ్చిన సీఎం జగన్.


ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి  కేవలం రాజకీయాల్లోనే తన మార్కు చూపిస్తారని చాలామంది అనుకుంటారు. కానీ ఆయన  పరిపాలన అందించే అధికారులను సెలెక్ట్ చేసే విషయంలో కూడా అద్భుతంగా ఆలోచన చేశారు.  రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో నడిపించాలంటే ముఖ్యంగా ప్రభుత్వ పాలన నడిపించే అధికారులు సమర్థవంతులై ఉండాలని గ్రహించారు. దీంతో దేశం మొత్తం అద్భుత పనితీరు కనబరిచినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎంపిక చేసుకొని మరి రాష్ట్రానికి తెప్పించుకున్నారు. అధికారుల అద్భుతమైన సలహాలతో పేద, మధ్యతరగతి ప్రజలు, విద్యార్థుల కోసం అనేక పథకాలు తీసుకువచ్చి వాటిని అమలు పరచడంలో సఫలం అయ్యారని చెప్పవచ్చు. 


ఆ విధంగా జగన్ మెచ్చిన అధికారుల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కూడా ఒకరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్దనుకొని వదిలేసిన ఈ ఐఏఎస్ అధికారికి జగన్ సముచిత స్థానం కల్పించారు. ఆకునూరి మురళిని పాఠశాలల విద్య మౌలిక సదుపాయాల కల్పన సలహాదారునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆకునూరి మురళి కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో ఇష్టమైనటువంటి విద్యావ్యవస్థలో  కీలకమైనటువంటి పోస్టింగ్ ఇవ్వడంపై జగన్ ను అభినందించారు. అంతేకాకుండా  ఏపీలోని ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థులపై, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నాడు నేడు పేరుతో ఎన్నో అభివృద్ధి పనులు తీసుకువచ్చారు.

ఆయన మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సలహాదారుడిగా పనిచేసి  ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆకునూరు మురళి పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ  జగన్ లాంటి సీఎం ని ఇప్పటివరకు చూడలేదని, ఆయన విద్యావ్యవస్థపై ఎంతో దృష్టి పెట్టారని, నాడు నేడు కు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన విద్య పేద ప్రజలకు అందుతుందని, జగన్ బెస్ట్ సీఎం అంటూ  కితాబు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: