ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పర్వం ముగిసింది. రాష్ట్ర ప్రజలు అంతా కూడా ఇప్పుడు ఎన్నికల ఫలితాలు కోసం నరాలు తెగే ఉత్కంఠటతో ఎదురు చూస్తున్నారు . ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీకి భారీ స్థానాలు లభించే అవకాశం కనిపించడం లేదు.. ఎందుకంటే ఈ సారి పోలింగ్ ఘననీయంగా పెరిగింది. యువకులు ఈసారి భారీగా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు గంటల తరబడి క్యూ లైన్స్ లో నుంచుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ సారి గెలుపు పై అధికార పార్టీ వైసీపీ ఎంతో ధీమాగా వుంది. గత ఎన్నికలలో సాధించిన సీట్ల కంటే ఈ సారి మరింత ఎక్కువ సీట్లు సాధిస్తామని వారు ఎంతో పక్కాగా చెబుతున్నారు.అయితే సీఎం గా వైసీపీ నేత జగన్ ప్రమాణస్వీకారం చేసే ముహూర్తం కూడా వారు ఫిక్స్ చేసారు.. ఏర్పాట్లు కూడా మొదలు పెడుతున్నట్లు సమాచారం.ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు విజయోత్సవ కార్యక్రమాలు చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 

రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాలు జగన్ పాలన చూసిన ప్రజలు మరో సారి జగన్ కే పూర్తి మద్దతు తెలిపినట్లు వైసీపీ నేతలు తెలుపుతున్నారు.. ఇదిలా ఉంటే టీడీపీ నేతలు కూడా గెలుపు పై ఎంతో ధీమాగా వున్నారు.ఈ సారి కూటమి భారీ విజయం సాధించనుందని తెలుగు తమ్ముళ్లు ఎంతో ధీమాగా వున్నారు.. అయితే శాసన మండలిలో వైసీపీ పూర్తి మెజారిటితో వుంది. దీనితో ఈసారి ఎన్నికల కౌంటింగ్ ముగిసే లోపు పార్టీ ఫిరాయించిన ఎమ్ఎల్సి ల పై అనర్హత వేటు వేసేందుకు సిద్ధం అవుతుంది.ఇప్పటికే పార్టీ ఫిరాయించిన జంగా కృష్ణ మూర్తిపై శాసన మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. తాజాగా పార్టీ మారిన ఎమ్ఎల్సి రఘు రాజును మండలి చైర్మన్ విచారణకు పిలిచారు. ఈ విచారణకు రఘు రాజు గైర్హాజరు అయ్యారు.దీనితో రఘు రాజుపై కూడా అనర్హత వేటు వేయనున్నారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చేలోపే అనర్హత వేటు వేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: