•ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం..
•తెలుగు తమ్ముళ్ల కళ్ళల్లో సంతోషం..
• దిగివచ్చిన దేశ  ఉద్దండ నాయకులు
•ఉప్పొంగిన ఆంధ్రుల ఆనందం..
• కొలువుదీరిన  కొత్త ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మీయ నాయకుడు..అలుపెరగని పోరాట యోధుడు.. ప్రజా సమస్యలపై పరితపించే నాయకుడు..40 ఇయర్స్ రాజకీయ అనుభవం కలిగినటువంటి వీరుడు.. 5 కోట్ల బలగానికి పాలకూడయ్యాడు.. మహోత్తరమైన ఘట్టాన్ని దేశ ప్రధాన నేతల చేతుల మీదుగా నిర్వహించుకొని దేశానికి, రాష్ట్రానికే బాహుబలి గా మారాడు. అలాంటి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ ప్రజలంతా ఆనందోత్సాహాలతో, కరత్వాల ధనులతో స్వాగతం పలుకుతున్నారు. అలాంటి గొప్ప నాయకుడు రాష్ట్రంలో గొప్ప సంస్కరణలు తీసుకొస్తారని, ప్రజల వద్దకే పాలన అందిస్తాడని కోరుకుంటున్నారు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.

బాబు మోడీకే తలమానికం:
ఇప్పటివరకు ఏపీ చరిత్రలో ఎన్నడు లేని విధంగా రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి చేరాడు నారా చంద్రబాబు నాయుడు. ఐదు కోట్ల ఆంధ్రులు కాలర్ ఎగరేసుకునే విధంగా ఆంధ్రుడా మజాకా  అనే విధంగా పేరు తెచ్చి పెట్టాడు. ఏకంగా దేశ రాజకీయాల్లోని అతిరథ మహారధులని తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి రప్పించుకున్నాడు అంటే ఆయన మామూలు వ్యక్తి కాదనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు ఒక వ్యక్తిగా కాకుండా దేశంలో ఒక శక్తిగా ఎదిగాడు.

ఆశలతో ఆంధ్రుల ఎదురుచూపు:
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో  ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా  ఆశలతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్రానికి రాజధానిని  పూర్తి చేయడమే కాకుండా,  అభివృద్ధి, సంక్షేమం చేయాలని కోరుకుంటున్నారు. ఇక నిరుద్యోగులు అయితే 20 లక్షల ఉద్యోగాలు మా చంద్రన్న ఇవ్వగలరనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కేంద్రం మెడలు వంచైనా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తారని, ఏపీని దేశంలోని అగ్రగామిగా నిలబెడతారనే ఆశలతో ఏపీ ప్రజలంతా కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్న సమయంరానే వచ్చింది. మరి చూడాలి ఇవాల్టి నుంచి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏ విధంగా పరుగులు పెట్టిస్తారు అనేది ముందు ముందు తెలుస్తుంది.

చంద్రబాబు ప్రమాణం కుటుంబంలో ఆనందం:
ఓ వైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలంతా టీవీల ముందు కూర్చొని, భావోద్వేగానికి గురయ్యారని చెప్పవచ్చు. అన్న పాలన మళ్లీ రాబోతోందని  ఆనందోత్సాహాలతో  ఉన్నారు.  ఇక చంద్రబాబు కుటుంబ సభ్యులైతే ఎంతో ఆనందంతో ఆనందభాష్పాలను జారవిడుస్తున్నారు. ఓవైపు చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, కొడుకు లోకేష్, మనవడు దేవాన్ష్ నారా చంద్రబాబు పట్టాభిషేకాన్ని తనివితీరా తిలకిస్తూ కరతాల ధ్వనులు చేసారు. ఇలా 5 కోట్ల ఆంధ్రుల  ఆనందోత్సాహాల మధ్య "చంద్రబాబు నాయుడు" బాహుబలి రేంజ్ లో  ముఖ్యమంత్రిగా పట్టాభిశిక్తుడయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: