టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కార్ తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన త్రివిక్రమ్ పైన పలు రకాల ట్విట్ట్లు షేర్ చేస్తూ పాపులారితే సంపాదించింది హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ నిరంతరం ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూ ఉంటుంది. మొదట మాయాజాలం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత శౌర్యం , శ్రీనివాస కళ్యాణం, గగనం తదితర చిత్రాలలో నటించిన వర్కౌట్ కాలేదు. చివరిగా 2022లో నాతిచరామి అనే సినిమాలో కనిపించింది.


తాజాగా పూనమ్ కార్ చేసిన ట్విట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పూనమ్ కౌర్ ఇలా రాసుకుంటూ.."కుట్రపూరితంగా మోసం చేసి గెలవడం కంటే ఒక యోధుడిలా ఓడిపోవడమే మేలు అంటూ ఒక ట్వీట్ చేసింది పూనమ్ కౌర్.. ఈ ట్విట్ చూసిన నెటిజన్స్ సైతం ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల గురించి ఈమె పోస్ట్ చేసిందని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించే ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈవీఎంల పైన చర్చ జరుగుతున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ ఇలాంటి ట్విట్ చేయడంతో ఒక్కసారిగా చర్చనీ అంశంగా మారింది.


గతంలో చేనేత వస్త్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ఈ అమ్మడు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉన్నది. అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా అప్పుడప్పుడు సపోర్టు చేస్తూ ఉంటుంది పూనమ్ కౌర్.. గతంలో అనారోగ్య సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేసింది అయినప్పటికీ కూడా తనకు మంచి క్యారెక్టర్ వస్తే పలు సినిమాలలో నటించడానికి సిద్ధంగానే ఉన్నది. ఏది ఏమైనా పూనమ్ కౌర్ చేసిన ట్విట్ మాత్రం అటు ఇండస్ట్రీలో రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతోంది. మరి ఈ ట్విట్ పైన అసలు క్లారిటీ ఏంటనే విషయం ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: