తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి అన్నది ఊహకందని విధంగానే మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ అటు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ లోని ఎమ్మెల్యేలు అందరిని కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కారు పార్టీలోని కీలక నేతలందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు అన్న విషయం తెలిసిందే. నిన్నటికీ నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా బిఆర్ఎస్ పార్టీని వదలడం మరింత సంచలనంగా మారిపోయింది.


 ఇలాంటి సమయంలో ఇక బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఇళ్లపై ఈడీ సోదరుల నిర్వహిస్తూ ఉండడం మరింత హాట్ టాపిక్ గా  మారింది  ఇటీవల పటాన్చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సహా అతని సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇల్లు ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు జరిపారు.  దాదాపు రెండు రోజులపాటు ఇక ఈ సోదాలు జరిపారు  కాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దాదాపు 300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు అని ఏడి అధికారులు ప్రకటనలో తెలిపారు  ఏకంగా అక్రమ మైనింగ్ చేస్తూ గూడ మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి 300 కోట్ల అక్రమలకు పాల్పడ్డారని ఈడీ అధికారులు నిర్ధారణకు వచ్చారు.


 ఇలా అక్రమ మైనింగ్ ద్వారా ఏకంగా ప్రభుత్వానికి 39 కోట్ల రూపాయల నష్టం చేకూర్చినట్లు ఇక ఈ సోదాలలో అధికారులు గుర్తించారట  మనీలాండరింగ్ హవాలా అనుమానాలతో ఆకస్మిక దాడులు చేశారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. రియల్ ఎస్టేట్లో ఈ డబ్బులను పెట్టుబడిగా పెట్టారని గుర్తించిన  అధికారులు సోదాలు పూర్తయిన తర్వాత దీనిపై అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలా అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన డబ్బు మొత్తాన్ని కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేశారని.  కొంత డబ్బును బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్సాక్షన్స్ చేసుకున్నట్లు  గుర్తించారు. అయితే ఈ సోదాలలో 9 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న అధికారులు బినామీ పేర్ల మీద ట్రాన్సాక్షన్స్ జరిపారని.. కొన్ని బ్యాంకు లాకర్స్ ని తెరిచి పూర్తిస్థాయిలో లెక్క కట్టాల్సి ఉంది అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: