- తెలంగాణ బతుకమ్మగా ప్రత్యేక గుర్తింపు.
- కవితమ్మ నీకెవరు సాటిలేరమ్మా.!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారు. ఆయనతోపాటు వెన్నుదన్నుగా ఉంటూ తన బిడ్డ కవితమ్మ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. చివరికి తెలంగాణ ప్రత్యేక పండుగ అయినటువంటి బతుకమ్మ పండగను ఉద్యమంలో అడుగడుగునా చూపించి ఆడపిల్లలను కూడా ఉద్యమానికి ఆకర్షితులయ్యేలా చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కల్వకుంట్ల కవిత చేసిన కృషి అంతా ఇంతా కాదు. అలా ఉద్యమం నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకున్న కవిత అంచలంచలుగా ఎదిగింది. అలాంటి కవిత రాజకీయ ప్రస్థానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
కేసీఆర్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి.!
తెలంగాణ యాస భాష అన్నీ కలగలిపిన మహిళ ఈమె. తెలంగాణ ప్రత్యేక పండుగ అయినటువంటి బతుకమ్మ గురించి పలు దేశాలకు సాటి చెప్పినటువంటి దీరవనిత కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్రం నుండి పార్లమెంటులో తొలి మహిళగా గళం విప్పిన నాయకురాలు. తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించింది. తండ్రి ముఖ్యమంత్రి అయినా కానీ, ఆ ఫీలింగ్ లేకుండా తన పని తాను చేసుకుంటూ ప్రజా సమస్యల ద్యేయంగా ముందుకు వెళ్ళింది. కవితా 1978 మార్చి 13న జన్మించింది. హైదరాబాదులో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈమె ఆ తర్వాత పై చదువుల కోసం అమెరికా వెళ్లి 2001అమెరికన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ పొందింది. కొన్నాళ్లపాటు ఉద్యోగం చేసిన ఈమె 2003లో అనిల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.
జీవిత విశేషాలు:
2004లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో కవిత అమెరికా నుండి తెలంగాణకు వచ్చి, 2006లో నల్గొండ జిల్లాలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించారు. 2009 నుంచి మొదలు తెలంగాణ 2014 వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించింది. 2006లో కేసీఆర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఉద్యమ సమయంలో తండ్రి వెనుక ఉంటూ పోరాటంలో అణువణువు సహకారం అందించింది. ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు అన్ని మాయమైపోతున్నాయని తెలంగాణ ప్రజలకు చాటి చెబుతూ 2008 జూన్ 6న తెలంగాణ జాగృతి స్థాపించింది. 2008 అక్టోబర్ లో రాష్ట్రంలోని 10 జిల్లాలలో తొలిసారిగా బతుకమ్మ ఉత్సవాలను జరిపి మహిళల మనసులో స్ఫూర్తిని నింపారు. అలాగే జాగృతి తరఫున ఎంతోమంది తెలంగాణ యువతి, యువకులకు ఉద్యోగాలపై స్కిల్స్ అందిస్తూ భవిష్యత్తుకు బాటలు వేశారు. జాగృతి ఆధ్వర్యంలో రైలు రోకో, సకజనుల సమ్మె, వంటావార్పు వంటి కార్యక్రమాలతో కోట్లాదిమంది ప్రజలను ఏకం చేసింది. ఇక బతుకమ్మ పండుగ 2017 అక్టోబర్ లో హైదరాబాదులో లక్షల మందితో కలిసి కవిత నిర్వహించారు.
రాజకీయ అరంగేట్రం:
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావడంలో ఎంతో కృషి చేసినటువంటి కవిత 2014లో నిజామాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేసి భారీ సారి విజయం సాధించారు. నిజామాబాద్ పసుపు బోర్డు ఏర్పాటు కోసం పార్లమెంట్ లో తన గళం వినిపించింది కవిత. ఇక 2019 ఎన్నికల్లో మరోసారి నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ధర్మపురి అరవింద్ చేతులో ఓడిపోయారు. మరోసారి 2022లో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. 2023లో ఢిల్లీ లిక్కర్స్ స్కాం కేసులో ఇరుక్కుని ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి