- 13 సార్లు శాసనసభగా ఎన్నికై చరిత్ర..
- ప్రజలపై కరుణ చూపే ఆయన చివరికి జైలుకు..
తమిళనాడు రాజకీయ నాయకుల పేర్లు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది దివంగత రాజకీయ నేతలు కరుణానిధి మరియు జయలలిత. తమిళనాడు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా వీరు కృషి చేశారు. అంతేకాదు కరుణానిధి ఎక్కువసార్లు సీఎం పీఠాన్ని అధిరోహించి చరిత్ర కూడా సృష్టించారు. ఇలా ప్రజల మనసులు దోచి తమిళనాడులో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన కరుణానిధి చివరికి చిన్న స్కామ్ లో ఇరుక్కుని జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. అలాంటి కరుణానిధి గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
కరుణానిధి అరెస్టుకు కారణం:
తమిళ నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. కానీ కొన్ని కారణాలవల్ల తన పేరును కారుణానిధిగా మార్చుకున్నారట. కేవలం ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివిన కరుణానిధి చిన్నతనం నుంచే ఉద్యమాలన్నా..పేద ప్రజల తరఫున కొట్లాడాలన్నా..చాలా ఇష్టమట. మూఢవిశ్వాసాల నుంచి ప్రజలను బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈయన 14 ఏళ్ల వయసులోనే హిందూ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని చాలాసార్లు అరెస్టై కేసుల పాలయ్యారు. 1949లో పెరియార్ తో విభేదించిన ఆయన అణుంగు శిష్యుడు సీఎన్ అన్నాదురై ద్రావిడ మున్నేట్ర కజగం ( డీఎంకే ) స్థాపించి వ్యవస్థాక సభ్యుల్లో కరుణానిధి ఒక్కడిగా మారారు. 1957లో రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేశాడు. ఈ సమయంలో కరుణానిధి కులితలై అనే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పటికీ ఆయన వయసు 33 సంవత్సరాలు.