ఇదే పరిస్థితి కొనసాగితే వైసీపీలో జగన్, ఒకరిద్దరు కీలక నేతలు మినహా ఎవరూ ఉండే పరిస్థితి అయితే కనిపించడం లేదు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ వీరాభిమానులు సైతం రాష్ట్రంలో పార్టీ పుంజుకుంటుందని నమ్మట్లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగానే అర్థమవుతుందని చెప్పవచ్చు.
వైసీపీకి ఇలాంటి పరిస్థితి రావడానికి జగన్ గతంలో చేసిన తప్పులు కొంతమేర కారణమైతే ఇప్పుడు చేస్తున్న తప్పులు కొంతమేర కారణమని చెప్పవచ్చు. రాష్ట్రంలో వైసీపీని వీడిన నేతలు టీడీపీలో చేరే అవకాశం లేకపోతే జనసేన వైపు బీజేపీ వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండటంతో ఏ పార్టీలో చేరినా నష్టం అయితే లేదని వైసీపీని వీడిన నేతలు భావిస్తుండటం గమనార్హం.
వైసీపీకి రాబోయే రోజుల్లో మరిన్ని భారీ షాకులు అయితే తప్పవని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీకి దూరమయ్యే నేతలు ఎవరో చూడాల్సి ఉంది. జగన్ ఇప్పటికైనా పార్టీపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. మరి జగన్ ప్లాన్స్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. జగన్ ఎన్నికల తర్వాత చేస్తున్న పనులు సైతం విమర్శల పాలవుతూ ఉండటం ప్రస్తుతం నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్ అవుతోంది.