దీంతో తెలంగాణలో మందుబాబుల ఆనందానికి ఎక్కడ బ్రేకుల పడలేదు. కావాల్సినంత మద్యం అందుబాటులో ఉంది. కానీ ఏపీలో మాత్రం గతంలో జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలో పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముందుగా మద్యపాన నిషేధం చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం హామీని మరిచిపోయారు. మద్యం ధరలను భారీగా పెంచి సామాన్యుడికి మద్యాన్ని అందుబాటులో లేకుండా చేశారు. ఇక ఇలా చేయడం వల్ల ఎంతోమంది నకిలీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేశాయ్.
అయితే ఇక ఇప్పుడు ఏపీ కొత్త సీఎం చంద్రబాబు కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చారు. మందుబాబులందరికీ గుడ్ న్యూస్ చెప్పేశారు. 99 రూపాయలకే క్వార్టర్ మందు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 3400కు పైగా మద్యం షాపులను పెట్టేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా గోవాలో తక్కువ ధరకు మద్యం దొరుకుతుంది ఇక ఇప్పుడు గోవా కంటే తక్కువగా ఏపీలో మద్యం అందించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. దీంతో ఏపీలో మందుబాబుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.