ఆపరేషన్ సిందూర్.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోగిపోతుంది. భారత దేశవ్యాప్తంగా ఆపరేషన్ సిందూర్ కు ఎలాంటి స్పందన లభిస్తుందో అందరికీ తెలిసిన విషయమే . భారతదేశ కీర్తి పతాకం ప్రపంచ వీధుల్లో రెపరెపలాడుతుంది అంటే వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ ఆపరేషన్ సిందూర్.  భారతజాతి నిండు గౌరవం తలెత్తుకొని సింహంలా గర్జిస్తుంది అంటే దానికి కారణం ఆపరేషన్ సిందూర్. పాకిస్థాన్  అల్లాడిపోతూ  మమ్మల్ని వదిలేయండి రా బాబు ఇక కు మీ జోలికి మేము రాం అని చెప్పేలా చేసింది అంటే దానికి కారణం ఆపరేషన్ సిందూర్.


ఇండియన్ ఆర్మీ మూడు రోజులుగా తిండి నిద్ర మానుకొని అదరగొట్టేస్తుంది.  మొదటగా తొమ్మిది ఉగ్ర స్థావరాలను పేల్చేసి దట్ ఈజ్  ఇండియా అంటూ ప్రూవ్ చేసిన ఆర్మీ టీం.. పాక్  కౌంటర్  అటాక్ కు ట్రై చేయడంతో వాటిని తిప్పికొడుతుంది . అదేవిధంగా కరాచీ - ఇస్లామాబాద్ - లాహోర్ -రాల్వపిండి  అనే పెద్ద సిటీస్ ని సైతం భారత్ టైం చూసి దెబ్బ కొట్టింది . లాహోర్ ఎయిర్పోర్ట్ మొత్తం ఫసక్ అక్కడే చెప్పుకోవడానికి ఏమీ లేదు . పాకిస్తాన్ గురువారం రాత్రి భారత సరిహద్దుల రాష్ట్రాలపై దాడికి పాల్పడింది.  దీనికి కౌంటర్ గా భారత్ కూడా అదేవిధంగా పాకిస్తాన్ కి భారీ నష్టం వచ్చేలా చేసింది. అయితే ఈ విషయం పక్కన పెడితే సరిహద్దుల్లో ఇంత పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొన్న మూమెంట్లో ఆపరేషన్ సిందూర గురించి యావత్ ప్రపంచం చర్చించుకుంటున్న మూమెంట్లో వ్యాపారస్తులు తమదైన తెలివితేటలు ఉపయోగించి ఆపరేషన్ సిందూర్ ని ఒక వ్యాపారంలా చూస్తున్నారు.



ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు ఇది ఒక పేరు మాత్రమే కాదు  దేశ ప్రజల ఎమోషన్ అని కూడా చెప్పాలి . సుమారు 140 కోట్ల మంది భారతీయుల గుండు చప్పుడే ఈ ఆపరేషన్ సిందూర్. అయితే ఈ ఆపరేషన్ సిందూర్ తో ఇప్పుడు వ్యాపారం చేయాలని చూస్తున్నారు కొన్ని బడా సంస్థలు . ఆ పేరుతో ట్రేడ్ మార్క్ లైసెన్స్ కావాలి అంటూ ఇప్పటికే చాలా సంస్థలు అప్లై చేశాయి.  ఆశ్చర్యం అదేవిధంగా బాధాకరమేంటంటే అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జాన్ జిగిడి అయిన ఎంత ఇష్టమైన రిలయన్స్ కంపెనీ కూడా ఉండడం .



ఆపరేషన్ సిందూర్ ట్రేడ్ మార్క్ కోసం రిలయన్స్ దరఖాస్తు చేసుకుంది అన్న వార్త బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా ముఖేష్ అంబానీ పై జనాలు విరుచుకుపడ్డారు.  అసలు బుద్ధుందా ..? డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతావా..? అంటూ దారుణాతి దారుణమైన పదాజాలంతో అంబానీని ఏకేశారు.  అంబానీ ఎప్పుడు కూడా ఇలాంటి నెగిటివిటీ ఫేస్ చేయడం చూడలేదు . ఫర్ ద ఫస్ట్ టైం అంబానీ సోషల్ మీడియా వేదికగా ఇంత నెగిటివిటి పేస్ చేశారు. జనాల దెబ్బకు  అంబానీ కూడా దిగివచ్చి ఆపరేషన్ సిందూర్ ట్రేడ్ మార్క్ లైసెన్స్ కోసం పెట్టిన అప్లికేషన్ ని విత్ డ్రా చేసుకున్నారు.



అంతే కాదు పొరపాటున తమ సంస్థకు చెందిన ఒక జూనియర్ ఉద్యోగి అనధికారికంగా ఆ దరఖాఖాస్తు దాఖలు చేసినట్లు కూడా తెలిపింది రిలయన్స్ సంస్థ . ఈ మేరకు ఒక ప్రకటన రిలీజ్ చేసి అందర్నీ కూల్ చేసింది.  అయితే అంత పెద్ద సంస్థకు సంబంధించిన ఉద్యోగి తనపై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఇలా చేస్తాడా..? ఇదంతా కప్పిపుచ్చుకునే ప్రయత్నమే .. దేశ ప్రజల ఎమోషన్ తో ఆడుకోవాలని చూశాడు అంబానీ అంటూ అంబానీని టార్గెట్ చేసి మరీ ఓ సర్టైన్  గ్రూప్ ఆయనపై దారుణతి దారుణంగా కామెంట్స్ పెడుతుంది.. ట్రోల్ చేస్తుంది . అంతేకాదు దేశభక్తితో వ్యాపారం చేస్తే తేడాలు వచ్చేస్తాయి .. ఎంత తోపైనా వ్యక్తి అయినా సరే దేశభక్తి ముందు తలవంచాల్సిందే.. గుర్తుపెట్టుకో అంబానీ అంటూ స్ట్రైట్ గా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు . కొంతమంది లిమిట్స్ క్రాస్ చేసి మరి సిగ్గు లేదా అంటూ దారుణతి దారుణమైన పదజాలంతో దూషిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: