
పై ఫొటో వెనక ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది. పై ఫొటోలు ఉన్న ముగ్గురు తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణకు నిజమైన హీరోలు అని చెప్పాలి. పై ముగ్గురు నేతలు తాజాగా నామినేటెట్ పదవులకు ఎంపికైన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేఎస్. జవహర్. ఈ ముగ్గురు నేతలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గత 20 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. ఈ ముగ్గురిలో గన్ని సీనియర్. ఆయన 2004 ఎన్నికలకు ముందు నుంచే ఉంగుటూరు నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉన్నారు. 2014లో ఉంగుటూరు ఎమ్మెల్యే అయ్యారు. 2009లో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసిన శేషారావు, 2014లో కూడా రెండోసారి గెలిచారు. ఇక తొలిసారి 2014లో ఎమ్మెల్యే అయ్యి. తొలి టర్మ్‌లోనే మంత్రి కూడా అయ్యారు జవహర్.
ఈ ముగ్గురు నేతలు పార్టీకి వీర విధేయులు... ప్రతిపక్షంలో ఎన్నోపోరాటాలు చేసి పార్టీ గెలిచే టైంలో పార్టీ వీరికి అవకాశాలు ఇవ్వకపోయినా కూడా అధిష్టానాన్ని ఎక్కడా పల్లెత్తు మాట కూడా అనలేదు. 2014లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచిన వీరు 2019లో ముగ్గురు ఓడిపోయారు. నాడు జవహర్ మంత్రిగా ఉండి కూడా కొవ్వూరు సీటు వదులుకుని జిల్లా మారి తిరువూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మొన్న ఎన్నికల్లో ఉంగుటూరులో గన్ని, నిడదవోలులో శేషారావు జనసేనతో పొత్తు ధర్మం పాటించి చంద్రబాబు ఆదేశాలు పాటిస్తూ తమ సీట్లు త్యాగం చేసి తమ నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలను గెలిపించారు. ఇక తిరువూరు సీటును కొలికపూడికి అమరావతి జేఏసీ కోటాలో కేటాయించడంతో ఓ సీనియర్‌గా ఉండి.. మాజీ మంత్రి అయ్యి ఉండి కూడా సీటు వదులుకున్న పరిస్థితి. ఎంతో మంది పార్టీ సీనియర్లు మంచి అవకాశాలు అందుకుని కూడా అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడమో మాట్లాడడమో చేశారు. కానీ ఈ ముగ్గురు ఎక్కడా పార్టీ లైన్ దాటకుండా గత ఎన్నికల్లో పనిచేశారు.
గన్ని అయితే పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నాలుగేళ్ల పాటు ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా జిల్లా అంతటా రంగులరాట్నం తిరిగినట్టు గిరాగిరా తిరిగి పార్టీ కేడర్‌లో మనోధైర్యం నూరిపోసిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అందుకే చాలా మంది సీనియర్లు రాష్ట్ర వ్యాప్తంగా పోటీపడినా కూడా గన్నికి ప్రతిష్టాత్మక ఆప్కాబ్ చైర్మన్ పదవి దక్కింది. ఇక నిడదవోలులో ఐదేళ్లు కష్టపడి తన సీటు జనసేన మంత్రి దుర్గేష్‌కు వదులుకున్నందుకు గాను శేషారావుకు ఏపీఎస్ఎస్‌డీసీ పదవి దక్కింది. ఇక మాజీ మంత్రి జవహర్ ఐదేళ్ల పాటు మీడియాలో నాటి వైసీపీ ప్రభుత్వ విధానాలను ఓ రేంజ్‌లో ఎండగట్టారు. ఆయన సీటు త్యాగం చేసినందుకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి దక్కింది. జనసేనకు పట్టున్న ఉభయగోదావరి జిల్లాలో తమ సీట్లు త్యాగం చేసిన ఈ ముగ్గురికి కార్పొరేషన్, నామినేటెడ్ పదవులు వచ్చిన సందర్భంగా వీరు అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన సందర్భంలో ఒకరినొకరు అభినందించుకుంటోన్నప్పటి ఫోటో ఇది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు