
ఏపీలో 2024 సాధారణ ఎన్నికల్లో కూటమి గా జట్టు కట్టిన తెలుగుదేశం - జనసేన - బీజేపీ అప్రతిహత విజయం సాధించి అధికారంలోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం జిల్లాలో ఈ మూడు పార్టీల కూటమి క్లీన్స్వీప్ చేసేసింది. ఉత్తరాంధ్ర లోని విజయనగరం , శ్రీకాకుళం జిల్లాలలో జనసేనకు ఒక్క సీటు కూడా గెలిచే సీన్ లేదన్న అపోహలు పటాపంచలు చేస్తూ విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల సీటును జనసేన గెలుచుకుంది. అక్కడ నుంచి పెద్దగా ఎవ్వరికి పరిచయం కూడా లేని లోకం నాగమాధవి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలో అందులోనూ ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మొత్తం 9 సీట్లలోనూ కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచి వైసీపీ అభ్యర్థులు మట్టి కరిచారు.
అలాంటి జిల్లాలో ప్రభుత్వం ఏర్పడి యేడాది కూడా కాకముందే రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోందంటున్నారు. ఓ సర్వే ఇదే విషయం చెప్పింది. ఉమ్మడి జిల్లాలో బొబ్బిలి - రాజాం అసెంబ్లీ నియోజకవర్గాలలో మాత్రమే కూటమి బలంగా ఉందని.. మిగిలిన 7 నియోజకవర్గాల్లో కూటమి లో కుమ్ములాటలు... విబేధాలతో వర్గ పోరు తీవ్రంగా ఉంటుందంటున్నారు. అయితే 2024 లో ఇక్కడ కూటమి ఘనవిజయం సాధిస్తుందని చెప్పిన సర్వే నే ఇది కూడా కావడం విశేషం. దీంతో సహజంగానే ఇది రాజకీయంగా చర్చకు తెరలేపింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు