కళాకారులకు ఎవరికైనా సరే కావాల్సింది వారు చేసిన దానికి ప్రోత్సాహం .. అవి రెండూ గత జగన్ ప్రభుత్వంలో ఎక్కడ కనిపించకుండా పోయాయి .. ప్రధానంగా సినిమా వాళ్ళని గడ్డి పరుచులా కూడా ఆయన పట్టించుకోలేదు .. టికెట్ రేట్లు తగ్గించి వారిని గట్టిగా అవమానించారు అవార్డులు ప్రోత్సాహకాల‌ మాటే ఎత్తలేదు .. ఘనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే నంది అవార్డు మొహం చూసి సినిమా ఇండస్ట్రీ చాలా సంవత్సరాలయిపోయింది .  అయితే అటు తెలంగాణలో కూడా ఇంతే .. అయితే ఇప్పుడు రెండు చోట్ల ప్రభుత్వాలు మారాయి అవార్డులన్నీ పునరుద్ధరించే పనిలో పడ్డాయి .. నంది అవార్డులు ఇస్తున్నామంటూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ..


అలాగే అందుకు సంబంధించిన కార్యచరణ కూడా రెడీ అవుతుంది .. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా గ‌ట్టి శుభవార్త రాబోతుంది .. త్వరలోనే నంది అవార్డుల ప్రక్రియ మళ్ళీ ప్రారంభిస్తామని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు .  ప్రధానంగా చిత్ర సీమకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని వాటిని మరింతగా అభివృద్ధి చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు ..  అలాగే నంది అవార్డులు కూడా చాలా ఏళ్ల నుంచి ఇవ్వటం లేదని .. ఇక ఇప్పుడు పాతవన్నీ ఒకేసారి క్లియర్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని .. అయితే ఇప్పుడు పది సంవత్సరాల అవార్డులని ఒకేసారి ఇవ్వాలా ? లేదంటే దశలవారీగా ఇవ్వాలా ? అనేది తెలియటం లేదని అవార్డులను ఒకేసారి ప్రకటించి మూడు రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఓ పండగల చేస్తే బాగుంటుందని ఆలోచన కూడా ఉందని ..


 అయితే ఇది అది ఖ‌ర్చుతో  కూడుకున్న పనైనా కానీ చిత్ర సీమ కోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా అనేది ప్రభుత్వ ఉద్దేశం .. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా నంది అవార్డులను ఒక పండగలా చేయాలని అంటున్నారు .. సంవత్సరాలు వారీగా కమిటీలు ఏర్పాటు చేసి విజేత‌ల్ని ఎంపిక చేయటం పెద్ద ప్రాసెస్ అది వీలైనంత త్వరగా మొదలు పెడితే బాగుంటుంది అని కూడా అంటున్నారు .. ఇప్పటికే తెలంగాణ నంది అవార్డుల కమిటీ తన పనులను ప్రారంభించింది .. ఏపీ నుంచి కూడా అలాంటి అడుగులు పడాలని సిని విశ్లేషకులు కోరుకుంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: