
చంద్రబాబు ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య అందుబాటులో ఉండాలని సూచించారు. మొదటిసారి గెలిచినవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అతివిశ్వాసం వల్ల నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు గత ప్రభుత్వంపై విసిగి కూటమికి ఓటేసిన నేపథ్యంలో, వారి నమ్మకాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు సర్వేల ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరును పరిశీలిస్తున్నానని, మంచి పనిచేసినవారికి అవకాశాలు ఇస్తానని ఆయన చెప్పారు.
పనితీరు లోపించిన వారిని 1995 నాటి విధానంతో దూరం చేస్తానని చంద్రబాబు హెచ్చరించారు. ఒకరిద్దరి తప్పిదాల వల్ల పార్టీ, ప్రభుత్వ ప్రయోజనాలను రాజీ చేయలేమని స్పష్టం చేశారు. త్వరలో ఎమ్మెల్యేలతో వ్యక్తిగత భేటీలు నిర్వహించి, వారి పనితీరు నివేదికలను అందజేస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు వివాదాలకు, ఆరోపణలకు దూరంగా ఉండాలని, నిత్యం ప్రజలతో మమేకం కావాలని సూచించారు.
కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు చేరువై, మంచి పేరు తెచ్చారని చంద్రబాబు ప్రశంసించారు. అయితే, ఒకరిద్దరి చర్యల వల్ల నష్టం జరుగుతోందని, అలాంటి వారిని అనుమతించనని గట్టిగా చెప్పారు. పరిపాలనలో అధికారుల తప్పిదాల వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, మంత్రులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తప్పు తెలిసి చేసినా, తెలియక చేసినా ఒకటేనని ఆయన ఉద్ఘాటించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు