గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు పుట్టిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కెసిఆర్ వారసులుగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన వారిలో కేటీఆర్, కవిత ఉన్నారు. ఇద్దరు కూడా తెలంగాణలో ఎంతో పేరు మోసిన లీడర్లు. అయితే ఇందులో కేటీఆర్, కెసిఆర్ తర్వాత నెక్స్ట్ స్థానాన్ని అధిరోహించాలని  కెసిఆర్ కూడా భావిస్తున్నారు. కానీ కవిత తండ్రి స్థానాన్ని మోయాలని ఆమె కూడా తాపత్రయపడింది. ఇంతలో కవితపై లిక్కర్ కేసు కావడం జైలుకు వెళ్లడం మళ్ళీ బయటకు రావడం ఇవన్నీ జరిగిపోయాయి. ఆ తర్వాత కవితను పార్టీలో కాస్త దూరం పెడుతూ వచ్చారు. నన్ను పార్టీలో చాలా చులకనగా చూస్తున్నారని దీనికి కారణం కేటీఆరే అంటూ ఆమె ఇన్ డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చింది.. కెసిఆర్ ను ఒక దేవుడిలా కొలుస్తూ మిగతా వారందరిని దయ్యాలంటూ వర్ణించింది.

అలా కవిత వ్యవహారం కొనసాగుతున్న తరుణంలో తాజాగా ఒక ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కెసిఆర్ కు  కవిత అడ్డుగా వచ్చి మాట్లాడినా కానీ ఆయన కనీసం చూడకుండా మాట్లాడకుండా వెళ్లిపోయారట. దీనికి కారణం కేటీఆర్ ఏ అంటూ కొంతమంది వార్తలు రాస్తూ వస్తున్నారు. బుధవారం కేసీఆర్ విచారణ సందర్భంగా ఆయన బిఆర్ కే భవన్ కు వెళుతున్న సమయానికి ముందే కవిత ఫామ్ హౌస్ కి వెళ్ళింది. ఇంతలో పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలుజారి పడడం ఆయన తుంటి భాగానికి గాయం కావడం అయింది. ఈ క్రమంలోనే కెసిఆర్ ను కలవడానికి వచ్చినటువంటి కవితను చూసినా కానీ పట్టించుకోకుండా వెళ్లిపోయారట. ముఖ్యంగా కేసీఆర్ లిఫ్టులో పైనుంచి కిందకు వచ్చేసరికి కవిత అక్కడే వేచి ఉందట..

గుడ్ మార్నింగ్ డాడీ అని పలకరించినా కానీ కెసిఆర్ సైలెంట్ గా వెళ్లి కాన్వాయ్ ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోయారట.. ఆయన వెళ్లిన కొద్దిసేపటికే కవిత కూడా ఆయన వెంట హైదరాబాద్ వెళ్ళిపోయింది. అయితే కేసీఆర్ డైరెక్ట్ గా విచారణకు వెళ్లి ఆ తర్వాత  పల్లా రాజేశ్వర్ రెడ్డి దగ్గరికి వెళ్లి పరామర్శించారు. దీనికంటే ముందే కవిత వెళ్లి పల్లా రాజేశ్వర్రెడ్డిని పరామర్శించింది. అయితే ఫామ్ హౌస్ కి వెళ్ళిన సమయంలో కెసిఆర్ తో ఉన్నటువంటి కొన్ని వీడియోలు ఉన్నాయి. కానీ ఆ వీడియోలలో కవిత కనబడకుండా టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయించారని  జాగృతి  నాయకులు ఆరోపిస్తున్నారు. కావాలనే కవితను సైడ్ చేస్తున్నారని, కావాలని వీడియోలలో ఆమె కనిపించకుండా ఎడిట్ చేసి మరి అప్లోడ్ చేశారని ఇదంతా కేటీఆర్ కు సంబంధించిన మనుషులే చేస్తున్నారని కేటీఆర్ పై విపరీతంగా మండిపడుతున్నారు జాగృతి నాయకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: