మాజీ సీఎం వైఎస్ జగన్ రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవుతుండగా ప్రజల నుంచి కూడా జగన్ కు ఊహించని స్థాయిలో స్పందన మద్దతు లభిస్తోంది. అయితే తాజా ప్రెస్ మీట్ లో జగన్ ధరించిన ఉంగరం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. జగన్ ధరించిన రింగ్ వెనుక అసలు కథ తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు. ఆ ఉంగరంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ రింగ్  హెల్త్ ట్రాకర్ తో ఉన్న  రింగ్ అని  సమాచారం అందుతోంది.  ప్రతిరోజూ ఎన్నో కార్యక్రమాలతో బిజీగా ఉండే జగన్  ఆరోగ్యానికి సంబంధించి  ఎలాంటి సమస్య తలెత్తకుండా ఈ రింగ్ ఉపయోగిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఇలాంటి ఉంగరాన్ని  ఉపయోగిస్తుండగా ఒక సందర్భంలో   ఈ ఉంగరం  గురించి ఆయన ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

అయితే ఈ ఉంగరాలు  ఈ నేతలకు నిజంగానే  హెల్ప్ చేస్తాయో లేదో తెలియాల్సి ఉంది.  జగన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాలంటే మాత్రం మరికొన్ని సంవత్సరాలు ఆగాల్సిందే.  జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నా  ఆ అభిమానం ఓట్లుగా మార్చుకోవడంలో  సక్సెస్ అయితే మాత్రం  వైసీపీకి తిరుగుండదు. అయితే నేతలను కాపాడుకోవాల్సిన, వాళ్లకు  ఇబ్బందులు రాకుండా మెలగాల్సిన బాధ్యత సైతం జగన్ పై ఉంది.

మాజీ సీఎం జగన్ ముందు ఎన్నో సవాళ్లు ఉండగా ఆ సవాళ్ళను ఈ నేత ఎలా అధిగమిస్తారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. గతంలో చేసిన తప్పులను దృష్టిలో ఉంచుకుని జగన్ మెలిగితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చినా 40 శాతం ఓటు బ్యాంక్ ఉందనే సంగతి తెలిసిందే. ఈ ఓటు బ్యాంకును పెంచుకుంటే వైసీపీకి ఊహించని స్థాయిలో ప్లస్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: