మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత సమావేశం ఆదివారం జరిగిన విషయం తెలిసిందే .. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ,ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ,జిల్లా అధ్యక్షులు ,నియోజకవర్గ ఇన్చార్జిలు ,పరిశీలకులు హాజరయ్యారు .. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు కాస్త ఘాటుగా స్పందించారు .. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి 56 మంది రాకపోవడం పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు .. విస్తృత స్థాయి సమావేశాలకి రానివారు .. ఇక వారి నియోజకవర్గాలకు ఏం చేస్తారంటూ చంద్రబాబు వారిపై తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేశారు .. ఎప్పుడు విదేశీ పర్యటనలు , పక్క పనులు చూసుకునేవారు ఇక అక్కడే ఉండటం మంచిదంటూ చంద్రబాబు వారిపై మండిపడ్డారు .. అలాగే ఒక విధంగా  ఘాటైన హెచ్చరికలు కూడా ఇచ్చారు .
 

అయితే  ఇందులో భాగంగా ఉదయం  విస్తృత సమావేశానికి ఎంతమంది వచ్చారు ? మొక్కుబడిగా సంతకాలు పెట్టేసి ఎంతమంది బయటకు వెళ్లిపోయారు ? లాస్ట్ వరకు ఎంతమంది ఉన్నారు ? అని వివరాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పిన చంద్రబాబు .. అలాగే తానా , ఆటా సమావేశాలకు వెళ్లే ఎందుకు టికెట్లు బుక్ చేసుకున్న వారు వివరాలు కూడా తన వద్ద ఉన్నాయని కూడా వారికి చెప్పారు .. ఇదే క్రమంలో ఇంటింటి ప్రచారం నేపథ్యంలో మంత్రులను ఈ సమక్షుల నుంచి కొంత మినహాయిస్తున్నామని చెప్పిన చంద్రబాబు .. ఎట్టి పరిస్థితోలను ఈ నెల రోజులు నియోజకవర్గంలోనే ఉండాలని కీలక ఆదేశాలు ఇచ్చారు .. అలాగే ఈ సందర్భంగా ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు .. ఇందులో భాగంగా కొంతమంది ఎమ్మెల్యేలు తమకు పట్టి ప‌ట్ట‌నట్టుగా ఉంటున్నారంటూ వారపై తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు .



అదేవిధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు అసలు సీరియస్ గా వారి పని చేయట్లేదని .. ఇవన్నీ మనకు ఓట్లు వేసిన ప్రజలు గమనిస్తున్నారని కూడా వారు గుర్తుపెట్టుకోవాలని .. అలాగే తను ఇచ్చిన‌ సూచనలతో వారి పనితీరు మార్చుకుంటే మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలుస్తారని .. లేదంటే అది మీ ఇష్టమని .. ఎలాంటి మొహమాటం ఉండదని ఆయన క్లారిటీ ఇచ్చేశారు .  అలాగే ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో శనివారం నుంచి ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తానని కూడా ప్రకటించారు .. ఈ సందర్భంగా రోజుకు నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడుతానని కూడా సీఎం చెప్పుకొచ్చారు .. అలాగే ఎమ్మెల్యేలకు తాను చెప్పాల్సింది చెబుతున్నానని వారి పనితీరు మారాలని కూడా వారికి వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు .. తాను చెప్పినట్టుగా వారి పనితీరు మార్చుకుంటే వారికే బాగుంటుంది అలా కానీ సమయంలో ఇక అంతే సంగతులని చంద్రబాబు స్పష్టమైన క్లారిటీ ఇచ్చేశారు .. అయితే  ఇదే క్రమంలో ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవర‌నే చర్చ కూడా బలంగా అక్కడ మొదలైంది ..



ఇదే క్రమంలో గత కొంతకాలంగా ఎమ్మెల్యేల పనితీరుపై కాస్త అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు .. ప్రధానంగా ఓ నలుగురు ఎమ్మెల్యేలను పిలిపించుకొని వారితో ప్రత్యేకంగా మాట్లాడినట్టు చెప్పటంతో .. ఇప్పుడు వారు ఎవర‌నే చర్చ పార్టీలో విపరీతంగా మొదలయ్యింది .. అలాగే ఆ నలుగురు ఎవరు ? వారిని ఎప్పుడు పిలిచారు ? ఏ విషయం మాట్లాడారు ? అని అక్కడికి వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు , ఎంపీలు ఇప్పటికే ఆరాలు తీయడం ప్రారంభించారు .. అయితే ఇదే క్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష తో చంద్రబాబు మాట్లాడినట్టు కొందరు చెబుతున్నారు .. అయితే  వారి నుంచి చంద్రబాబు ఎలాంటి వివరణాలు తెలుసుకున్నారు అని వాటిని రాబట్టేందుకు పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా అంటున్నా .. ఇదే క్రమంలో తర్వాత‌ విడుత‌లో చంద్రబాబు నుంచి ఎవరికీ పిలుపు వస్తుంది ? ఇప్పటికే ఎవరికైనా ఫోన్లు వచ్చాయ‌ ? మొదట నలుగురిని అడిగిన ప్రశ్నలే తమను అడుగుతారా ? లేక కొత్త ప్రశ్నలు ఉంటాయా ? అంటూ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు అభ్యర్థులు ఎంత టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేలు కూడా అలాగే తెగ ఆందోళన పెడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: