నారా చంద్రబాబు నాయుడు.. ఇండియా మొత్తంలో ఈయనంటే తెలియని వారు ఉండరు. దేశంలో ఎంతోమంది నేతలు ఉన్నారు. కానీ వీరందరిలో చంద్రబాబు నాయుడు చాలా డిఫరెంట్. ఆయన ఆలోచన విధానం ఏదైనా సరే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ఉంటుంది. అప్పటికప్పుడు ప్రజల్ని మభ్యపెట్టి మసి పూసి మారేడు కాయ చేయరు.. ఆయన ఏ పని చేసినా భవిష్యత్తులో ఎలా బ్రతకాలి అనే దానిపైనే ఆలోచన చేస్తూ ఉంటారు. అలాంటి చంద్రన్న సీఎం పదవిని అధిరోహించి నేటికి 30 సంవత్సరాలు. అప్పటినుంచి ఇప్పటివరకు గెలుపు ఓటమి అనేది పట్టించుకోకుండా  ప్రజా శ్రేయస్సే ప్రథమ ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు. ఇంత సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో  ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం కన్నీరు కూడా పెట్టుకున్నారు. 

అలాంటి చంద్రబాబు నాయుడు 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు.  ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన చంద్రబాబు దేశ రాజకీయాలను కూడా శాసించే స్థాయికి చేరుకున్నాడు. ఆయన హయాంలో ఎన్నో పథకాలను తీసుకువచ్చి అదరహో అనిపించారు. ఇప్పటికీ ఆయన చేసిన కొన్ని పనుల వల్ల లక్షలాదిమంది కడుపునిండా అన్నం తింటున్నారు. ముఖ్యంగా ఆయన తీసుకొచ్చిన పథకాల్లో జన్మభూమి, శ్రమదానం మంచి పేరు తెచ్చుకున్నాయి. అలాగే హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే  దానికి ప్రధాన ఆధ్యుడు చంద్రబాబు.  ముఖ్యంగా ఆయన హైదరాబాదులో హైటెక్ సిటీ నిర్మాణానికి పునాదులు వేసారని చెప్పవచ్చు. ప్రస్తుతం హైదరాబాదులో ఇంతమంది ఐటీ కంపెనీల ద్వారా ఉద్యోగాలు పొంది వారి వారి భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు అంటే అది చంద్రబాబు చలవే అని చెప్పవచ్చు.

 ఆనాడు ఆయన ఈ ఆలోచన చేసి ఉండకపోతే హైదరాబాద్ ఇప్పటికీ డెవలప్ అయ్యేది కాదు. ఇంతమంది చదువుకున్న యువతకు ఉద్యోగాలు వచ్చేవి కావు. ఆ విధంగా హైటెక్ సిటీని నిర్మించి భవిష్యత్ తరాలకు ఉద్యోగ బాటలు వేసిన గొప్ప మేధావి అని చెప్పవచ్చు. ఈ విధంగా చంద్రబాబు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. అలా 1995-1999, 1999-2004, ముఖ్యమంత్రిగా చేశారు.అలాగే తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మూడవసారి సీఎంగా 2014-2019 వరకు బాధ్యతలు చేపట్టారు. ఇక గత ఏడాది జరిగిన ఎన్నికల్లో  బిజెపి జనసేనతో పొత్తు పెట్టుకొని కూటమిగా ఏర్పడి నాలుగోసారి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే అందులో చంద్రబాబు పాత్ర కీలకమని కూడా చెప్పవచ్చు. ఇలా చంద్రబాబు రాష్ట్ర దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: