
కవిత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీ బిఆర్ఎస్ పార్టీ ఇంకా కవితకు సంబంధించి ఆమోదించలేదు. దీంతో తిరిగి ఆమెని బిఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం బిఆర్ఎస్ చీఫ్ కేసిఆర్ భార్య , కవిత తల్లి శోభ ఇటీవలే కవితతో చర్చించినట్లుగా వినిపిస్తున్నాయి. కవిత భర్త అనిల్ పుట్టినరోజు వేడుకలకు శోభ హాజరవ్వగా కవితకు కీలకమైన సూచనలు ఇచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులపాటు నిదానంగా ఉండాలని అన్ని పార్టీలో అన్ని సర్దుకుంటాయని కవితకు తల్లి భరోసా ఇచ్చినట్లు బిఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కవిత కుమారుడు పుట్టినరోజు వేడుకలకు కూడా కెసిఆర్ కుటుంబం నుంచి ఎవరూ వెళ్లలేదు.. కేవలం కొత్త బట్టలు పూజా సామాగ్రిని మాత్రమే పంపించారని సమాచారం.కానీ అల్లుడు పుట్టినరోజుకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
కెసిఆర్ కుటుంబంలో తీవ్ర విభేదాలు వేల కవిత ఇంటికి తల్లి శోభ వెళ్లడంతో త్వరలోనే కుటుంబ కలహాలు కూడా సర్దుకుంటాయని బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. కవిత అన్న కేటీఆర్ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె గురించి మాట్లాడడానికి ఏమీ లేదని చెప్పారు తప్ప ఎలా అంటే విమర్శలు చేయలేదు.. వీటన్నిటిని చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో తిరిగి మళ్ళీ కవిత బిఆర్ఎస్ పార్టీలోకి యూటర్న్ తీసుకునేలా కనిపిస్తోంది.