
అయితే తాజాగా అభిమానులకు ఒక హెచ్చరికను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక విషయాన్ని తెలియజేసింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి విషయాన్ని కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాటివల్ల కొంతమంది కేటుగాళ్లు సెలబ్రిటీల పేర్లను వినియోగించుకొని మరి స్కాములు చేస్తున్నారు. తాజాగా నటి ప్రగతి పేరుతో కొంతమంది కేటుగాళ్లు స్కామ్ కు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
కొంతమంది తన పేరును వాడుకొని డొనేషన్స్ తీసుకుంటున్నారని తెలిసింది. దీనిపైన ఇప్పటికే తాను పోలీసులకు ఫిర్యాదు చేశారని.. నా అభిమానులు దయచేసి ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నానని తెలిపింది. అందరూ కూడా చదువుకునే వాళ్లే ఉన్నారు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి ఇలాంటి స్కాములు పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ తెలియజేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపింది. అయితే ఈ విషయాన్ని ప్రగతి 5 రోజుల క్రితమే సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ప్రగతి కూడా చాలా తక్కువగానే నటిస్తూ ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొంటోంది.