
ఈ పాత్రలో టాలీవుడ్‌కే చెందిన ఓ యంగ్ హీరో కనిపించనున్నారని, క్లైమాక్స్ సీక్వెన్స్‌లో బాలయ్యతో కలిసి కీలక యాక్షన్ ఎపిసోడ్‌లో నటిస్తారని తెలుస్తోంది. ఈ అంశం ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం కలిగిస్తోంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే, సంయుక్త ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని టాక్. ఇక థమన్ అందిస్తున్న సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ట్రెండ్ సృష్టించి, అంచనాలను రెట్టింపు చేసింది.
అఖండ 2 - తాండవం సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు సినిమా యూనిట్ స్పష్టంచేసింది. బాలయ్య స్టైల్, బోయపాటి మాస్ మేకింగ్, థమన్ మ్యూజిక్ - ఈ కాంబినేషన్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే మరో మరపురాని సినిమాగా నిలుస్తుందన్న ఆశాభావం అందరిలోనూ ఉంది.