పాకిస్తాన్ తప్పుడు బుద్ధి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఉగ్ర వాదులను పెంచి పోషించడానికి అడ్డాగా మారింది. ఎంతో మంది ఉగ్ర వాదులకు స్థావరాలను ఇస్తూ పాకిస్తాన్ తన తప్పుడు బుద్ధిని ఎన్నో సార్లు ప్రదర్శించింది. ఇకపోతే పాకిస్తాన్ ఎప్పుడు భారత్ పై చెడు ప్రచారాలను , చెడు బుద్ధుని చూపిస్తూ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. కొంత కాలం క్రితం ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ , పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం మన అందరికి తెలిసిందే. అందులో భాగంగా పాకిస్తాన్ , భారత్ పై దాడి చేయడంతో ఇండియా కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ పై దాడి చేసింది.

దానితో పాకిస్తాన్ తన దాడి వల్ల ఇండియా పై ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. కానీ అదే భారత్ మాత్రం పాకిస్తాన్ పై చేసిన దాడికి ఆ దేశం విలవిలలాడింది. ఆ దేశానికి పెద్ద ఎత్తున నష్టం కూడా వచ్చింది. దానితో మన ఆర్మీ బలం ఏమిటి అనేది పాకిస్తాన్ కు స్పష్టంగా అర్థం అయింది. ఇక ఆపరేషన్ సింధూర్ అలాగే కొనసాగితే పాకిస్తాన్ పరిస్థితి కోలుకోలేని స్థితికి చేరిపోతుంది అని కూడా అనేక మంది విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. దానితో పాకిస్తాన్ ఏమీ చేయలేక వెనకడుగు వేసింది. భారత ఆర్మీ , పాకిస్తాన్  దాడిని ఎదుర్కోవడంలో అత్యంత అద్భుతంగా సక్సెస్ అయ్యింది. ఇక ఈ విషయం ప్రపంచం మొత్తం కూడా తెలుసు కానీ పాకిస్తాన్ మాత్రం ఈ ఓటమిని అస్సలు భరించలేక పోతుంది.

ప్రపంచం మొత్తం ముందు ఓడిపోయిన విషయం తెలియడంతో వీరు తాజాగా ఓ ఫెక్ వీడియోను తయారు చేసే దానిని వైరల్ చేసే పనిలో బిజీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా వారు గెలిచినట్లు పాకిస్తాన్ ఆర్మీ సభ్యులు , మన ఆర్మీ సభ్యులు కూర్చొని మాట్లాడుతున్నట్లు ఒక ఫేక్ వీడియోను తయారు చేసి దానిని సర్కులేట్ చేస్తున్నారు. దానితో భారత ప్రభుత్వం కూడా వీరిపై సీరియస్ అయింది. ఇలా మరోసారి పాకిస్తాన్ చెడు బుద్ధిని చూపించింది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: