
ఇలా ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం వెళ్లాలనుకొనే భారతీయుల ఆశలు కూడా ఆవిరవుతున్నాయి. అమెరికా పశ్చిమ దేశాలలో ఈ వలసల పైన చాలా వ్యతిరేకత పెరుగుతొంది. ఒకప్పుడు అమెరికాకి పరిమితమైన ఈ వలసల వ్యతిరేకత ఇప్పుడు ఐరోపా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో కూడా ఎక్కువగా వినిపిస్తోంది. అక్కడ వారి యొక్క భద్రత భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారుతోందని అందుకే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని నినాదంతో పలు నిరసనలను తెలియజేస్తున్నారు.
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అనుసరించినటువంటి ఈ విధానం వలసదారుల పైన చాలా వ్యతిరేకత మొదలయ్యేలా చేసింది. ఈ విషయంపై డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికలలో గెలిచిన తర్వాత వలస వచ్చిన వారిని పంపించేస్తామంటూ తెలియజేశారు. "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్". అనే నినాదంతో అమెరికాలో ఉండేవాటికి పెద్దపీట వేస్తూ వలసదారుల పైన చాలా కఠినమైన ఆంక్షలు విధించారు. ఇప్పుడు ఇలాంటి పద్ధతి ఇతర దేశాలలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది.
ఆస్ట్రేలియాలో కూడా వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఈ వలసలను ఆపాలంటు అక్కడ వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కెనడాలో కూడా భారతీయులతో సహా విదేశీయులను దేశం విడిచి వెళ్లిపోవాలంటు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్నారు. అలా ఐరోపాలో కూడా ఈ వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అన్ని చోట్ల కూడా భారతీయులే లక్ష్యంగా జాతి విద్వేష దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు కూడా తెలియజేస్తున్నారు.