టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎప్పుడూ నెంబర్ వన్ స్ధాయిలో ట్రెండ్ అవుతూ వచ్చేది ఒకే ఒక సినిమా అంటే, అదేమిటంటే మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఆ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్స్ రాకపోయినా, కేవలం ఆ సినిమా మీదున్న హైప్, హోప్ కారణంగానే సోషల్ మీడియాలో అది హాట్ టాపిక్‌గా మారేది. అయితే ఇప్పుడు ఆ సీన్ పూర్తిగా మారిపోయింది. రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో వస్తున్న “పెద్ది” సినిమా ఒక్కసారిగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దానికి కారణం బుచ్చి బాబు తీసుకున్న ఒక స్ట్రాంగ్ డెసిషన్. ఆయన చేసిన ఈ నిర్ణయం వల్లే నెట్టింట అంతా “పెద్ది” గురించే చర్చ మొదలైంది.


ఇప్పటికే ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాత్ర కోసం బుచ్చి బాబు ఎంతో జాగ్రత్తగా సరైన నటులను ఎంపిక చేస్తున్నాడని తెలుస్తోంది. తాజాగా రామ్ చరణ్ తల్లిగా నటించబోయే కీలక పాత్రకు ఒక సీనియర్ నటి ఎంపికైనట్లు సమాచారం బయటకు వచ్చింది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, ఈ పవర్‌ఫుల్ రోల్‌ కోసం తమిళ సినీ నటి విజీ చంద్రశేఖర్ ను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. గతంలో అఖండ సినిమాలో నందమూరి బాలకృష్ణ తల్లిగా నటించి ఘన విజయాన్ని అందుకున్న ఆమె, ఇప్పుడు “పెద్ది” లో రామ్ చరణ్ తల్లిగా కనిపించనుందట. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. ఫ్యాన్స్ అంతా ఆనందంతో నిండిపోయి “ఇక పెద్ది సినిమా ఎవరూ ఆపలేరు” అంటూ ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నారు.



ఇకపోతే ఈ సినిమాలో కేవలం ఒక పాత్రే కాదు, మొత్తం స్టార్ కాస్టింగ్‌నే ఒక హైలైట్ అని చెప్పాలి. ఇప్పటికే శివరాజ్ కుమార్, జాన్వి కపూర్, జగపతి బాబు వంటి పలువురు నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు అంటూ అఫిషియల్ ప్రకటన్ కూడా వచ్చేసింది. ఇంత భారీ స్థాయి నటీనటులు ఒకే సినిమాలో కనిపించడం వల్ల సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకే ఇప్పటివరకు సోషల్ మీడియాలో నెంబర్ వన్‌గా ఉండిన “శ్శంభ్29” ట్రెండ్‌ని వెనక్కి నెట్టి, ఇప్పుడు “పెద్ది” అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. చరణ్ – బుచ్చి బాబు కాంబినేషన్ మీదున్న ఈ హైప్ చూడగానే, నిజంగానే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సునామీ క్రియేట్ చేస్తుందో అనే కుతూహలం మరింత పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: