ప్రభాస్‌తో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా వదులుకోవడం అస్సలు జరగదు. ఆయన పక్కన చెల్లెలి పాత్రలోనైనా నటించడానికి చాలామంది హీరోయిన్లు రెడీగా ఉంటారు. అయితే ప్రభాస్ అభిమానులు చాలా ఈగర్‌గా ఒక ప్రత్యేక హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఈ హీరోయిన్‌తో స్క్రీన్ షేర్ చేస్తే చూడాలని అభిమానుల కోరిక. ఎప్పటి నుంచో వెయిటింగ్. ఆ హీరోయిన్ మరెవరో కాదు, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఇండస్ట్రీలో ఎప్పుడూ ట్రెండ్ అయ్యే ఈ నేచురల్ బ్యూటీ, కాంట్రవర్సీలకు దూరంగా, నటనకు దగ్గరగా ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతానికి బాలీవుడ్‌లో రామాయణం ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది.


కోలీవుడ్‌లో రెండు ప్రాజెక్టులు, టాలీవుడ్‌లో ఒక ప్రాజెక్ట్ చేస్తోంది. సాయి పల్లవి తన సినిమాల విషయంలో ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదు. అలాంటి సాయి పల్లవిని ప్రభాస్ పక్కన చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ను డైరెక్ట్‌గా ఈ విషయమై ప్రశ్నించారు. అప్పుడు ఆయన "సాయి పల్లవి నటన అంటే చాలా ఇష్టం, కానీ హైట్ మ్యాచ్ అవుతుందేమో చూడాలి" అంటూ సరదాగా తప్పించుకున్నారు ప్రభాస్. ఇప్పుడు ఆ కోరికను దర్శకుడు ప్రశాంత్ వర్మ నెరవేర్చబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమా కథ పూర్తయ్యింది. అయితే ప్రభాస్ డేట్స్ ఇంకా ఖాళీ లేవు. ఆయన కాల్‌షీట్లు ఇస్తే వెంటనే షూటింగ్ మొదలవుతుంది అని ప్రశాంత్ వర్మ ఇటీవల కన్ఫర్మ్ చేశారు.

 

స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉంది, పెండింగ్‌లో ఉన్నది ప్రభాస్ డేట్స్ మాత్రమే అని అంటున్నారు. ఇక ఇన్‌సైడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రశాంత్ వర్మ నేచురల్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవినే ఫైనల్ చేసినట్లు న్యూస్ బయటకి వచ్చింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇన్నాళ్లుగా వెయిట్ చేసిన ఈ కాంబినేషన్ చివరికి సెట్ అవుతోందా..? అన్న ఉత్కంఠలో ప్రమోషన్స్ కూడా మొదలైపోయాయి. చూడాలి మరి దీనిపై ప్రశాంత్ వర్మ ఎలా స్పందిస్తారో...??

మరింత సమాచారం తెలుసుకోండి: