
నేటితరం యువత ఎలా ఉందో.. వారు చేసే పనులు ఎలా కెరీర్‌ని స్పాయిల్ చేసుకుంటాయో.. తల్లిదండ్రులతో ఎలా బిహేవ్ చేస్తారో అన్న విషయాలను సినిమాలో చాలా రియలిస్టిక్‌గా చూపించారు. డైరెక్టర్ తన కామెడీ స్టైల్‌ను ప్రధాన బలంగా తీసుకొని సినిమాను ముందుకు తీసుకెళ్లి, బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ సాధించారు. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి స్టార్స్ ప్రశంసల వర్షం కురిపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమాపై పాజిటివ్‌గా స్పందించిన విషయం తెలిసిందే.అలాగే, యంగ్‌స్టర్స్ మరియు లవర్స్ ఈ సినిమాలోని కొన్ని కొత్త కాన్సెప్ట్‌లను తమ రియల్ లైఫ్‌లో అప్లై చేసుకుంటున్నారు. ఈ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో హీరో తన గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేయడానికి బర్త్‌డే సందర్భంగా స్వయంగా ఒక ట్యూన్ కంపోజ్ చేసి పాట పాడుతాడు. సినిమా మొత్తానికి ఇది హైలైట్ ఎపిసోడ్. ఈ పాట సినిమాకి మలుపు తిప్పింది.
థియేటర్లలో ప్రతి ఒక్కరు ఈ పాట చూసి కడుపుబ్బా నవ్వుకున్నారు. ప్రత్యేకంగా "కాత్యాయమి భోంచేశావా" అనే లిరిక్ వచ్చినప్పుడు థియేటర్లలో నవ్వుల వర్షం కురిసింది. ఆ సీన్‌ను ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు. ఇప్పుడు అదే విధంగా యువత తమ గర్ల్‌ఫ్రెండ్‌లను ఇంప్రెస్ చేయడానికి లిటిల్ హార్ట్శ్ సినిమాలోని ఐడియాను ఫాలో అవుతున్నారు. ప్రత్యేకంగా పాటలు కంపోజ్ చేసి, తమకు తోచిన లిరిక్స్ రాసుకుని వింత వింత ప్రయోగాలు చేస్తున్నారట. ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో ఓ లెవల్‌లో బాగా వైరల్ అవుతోంది.మొత్తానికి లిటిల్ హార్ట్శ్ సినిమా యూత్ నరనరాల్లోకి ఎక్కిపోయింది అన్నది మాత్రం నిజం.