ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడ్డాయి అంటే చాలు అక్కడ రాజకీయ పార్టీలు ఎంత హంగామా చేస్తూ ఉంటాయో ఇక మరో వైపు సర్వే వారిది కూడా అంతే రేంజ్ హంగామా ఉంటూ వస్తుంది. కొన్ని సర్వే సంస్థలు ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి అంటే అందుకు చాలా కాలం ముందు నుండే ఏ పార్టీకి ఎలాంటి పట్టు ఉంది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఏ పార్టీ ఎన్ని స్థానాలలో గెలుస్తుంది. ఎలాంటి పరిస్థితులు ఎలక్షన్లలో ఏర్పడతాయి. అనే దానిపై పెద్ద ఎత్తున సర్వే చేస్తూ ఉంటారు. అలా సర్వే చేసిన రిపోర్ట్ లను జనాల ముందుకు వచ్చాక జనాల ఒపీనియన్ ఎలా ఉంది అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. దాదాపు సర్వే రిపోర్ట్ లు ఏవి కూడా కరెక్ట్ అని చెప్పలేము.

ఒక సర్వే సంస్థ ఆ సర్వే వివరాలను ప్రకటించిన తర్వాత ఎన్నికలు జరిగాక ఆ ఫలితాలు వచ్చాక ఏ సర్వే సంస్థ వారు కరెక్ట్ అనేది తెలుస్తుంది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే బీహార్ లో ఎన్నికలు జరగబోతున్న విషయం మనకు తెలిసిందే. వచ్చే నెలలో బీహార్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే నెల 6 మరియు 11 వ తేదీల్లో రెండు విడతలుగా బీహార్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక వీటికి సంబంధించిన ఫలితాలు వచ్చే నెల 14 వ తేదీన విడుదల కానున్నాయి. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి మ్యాట్రిజ్ సంస్థ పెద్ద ఎత్తున సర్వే ను నిర్వహించింది.

తాజాగా ఈ సంస్థ వారు ఆ సర్వేకు సంబంధించిన రిపోర్టును విడుదల చేశారు. ఈ సర్వే ప్రకారం ఎండీఏ , అనగా బిజెపి జెడియు పార్టీకి 150 నుండి 160 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు , మహా గడ్బంద్ , ఆర్జెడి , కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు కలిపి  70 నుండి 85 సీట్లు వస్తాయి అని ఈ సంస్థ వారు అంచనా వేశారు. ఈ సంస్థ అంచనా ప్రకారం బిజెపి పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరి ఈ సర్వే ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: