ఆంధ్రప్రదేశ్‌ను రూపరేఖలు మొత్తం మార్చేసున్నారు చంద్రబాబు. అసలు కలలో కూడా ఊహించని ప్రాజెక్ట్ లు ఏపికి తీసుకొస్తున్నారు. ఏపీ ని  ఏఐ హబ్‌గా మార్చేందుకు విశాఖపట్నంలో కీలక ముందడుగు పడింది. వైజాగ్‌లో 1 గిగావాట్ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఒప్పందంపై ఇరు వర్గాల ప్రతినిధులు సంతకాలు చేశారు.  దీంతో దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అసియాయాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ నిర్మించనుంది గూగుల్ ఏపీలో అనే విషయం హాట్ గా వైరల్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2028-2032 మధ్య రాష్ట్ర జీడీపీకి ఏటా రూ.10,518 కోట్లు, 1.88 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు అంచనాలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఎక్కడ చూసినా “లోకేష్” పేరే గింగిరాలు కొడుతోంది. నిన్నమొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లోకేష్ గురించి నెగిటివ్‌గా వినిపించిన వార్తలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ఏకంగా గూగుల్‌తో మాట్లాడి, ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టే విధంగా ఆయన చేసిన ప్రసంగం, చూపించిన పనితీరు అందరినీ ఆశ్చర్యపరిచాయి. విశాఖపట్నంలో గూగుల్ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. మొదట అనుకున్నదానికంటే డబుల్ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. అయితే, విశాఖపట్నంలో గూగుల్ పెట్టుబడులు పెడితే, ఆంధ్రప్రదేశ్‌కు ఎంత ఆదాయం వస్తుంది? — అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

సెంట్రల్ గవర్నమెంట్ అంచనా ప్రకారం, గూగుల్ పెట్టుబడుల వలన విశాఖపట్నం ద్వారా ఏటా 10,585 కోట్లు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి నెలకు సుమారు 9,500 కోట్లు మాత్రమే ఆదాయం వస్తోంది. అంటే విశాఖపట్నం గూగుల్ ప్రాజెక్టు ద్వారా ఒక నెలలోనే రాష్ట్రానికి సంవత్సర ఆదాయం సమానంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. విశాఖపట్నంలో గూగుల్ పెట్టుబడి పెట్టడం వలన ఏపీకి నెలకు సుమారు 10,000 కోట్ల ఆదాయం వస్తుందని అర్థం. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం, గూగుల్‌కు కావాల్సిన అన్ని సహాయక కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా భూముల విషయంలో ప్రత్యేక ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. పోలవరం నుండి పురుషోత్తపట్నం వరకు నీటికి సంబంధించి ప్రాజెక్టు ప్రాధాన్యం సాగుతోందని సమాచారం బయటకి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. విశాఖపట్నంలో గూగుల్ పెట్టుబడులు పెట్టడం కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్ రాత్రింబవళ్లు కష్టపడ్డారని, ఇప్పుడు ఆ కల నిజం కానుంది అని అంటున్నారు. దీని ద్వారా వేలాది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ పెట్టుబడులు లేవని పేర్కొంటూ, లోకేష్‌ను ప్రజలు, ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: